Praja Darbar | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్ 8వ తేదీన ‘మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్’ లో ప్రారంభించిన ‘ప్రజాదర్బార్’కు విశేష స్పందన లభిస్తోంది.
ప్రజలు తమకు సంబంధించిన వివిధ రకాల సమస్యలపై వినతి పత్రాలను సమర్పించేందుకు ప్రజాభవన్ కు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.
ఈ కార్యక్రమం ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు మొత్తం 4,471 వినతి పత్రాలు అందినట్లు ప్రజా భవన్ అధికార వర్గాలు తెలిపాయి.
అందులో ఎక్కువ శాతం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, పెన్షన్ లకు సంబంధించిన వినతి పత్రాలు ఉన్నట్లు పేర్కొన్నారు.
తాజాగా సోమవారం నిర్వహించిన ‘ప్రజా వాణి’ కార్యక్రమంలో 1,143 వినతి పత్రాలు అందినట్లు ప్రజా భవన్ అధికారవర్గాలు వెల్లడించాయి.