Chiranjeevi Visits KCR | హైదరాబాద్ సోమాజీగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సినీ నటుడు చిరంజీవి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆసుపత్రి వెలుపల మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ కోలుకోవడానికి 6 వారాల సమయం పడుతుందని వైద్యులు చెప్పారని తెలిపారు. ఆయన త్వరగా కోలుకొని తిరిగి సాధారణ జీవితం ప్రారంభించాలని కోరుకుంటున్నానన్నారు.
సినిమాలు ఎలా ఆడుతున్నాయి.. ఇండస్ట్రీ ఎలా ఉందని కేసీఆర్ ఈ సమయంలో కూడా అడగటం చాలా సంతోషంగా అనిపించిందని చిరంజీవి తెలిపారు. అంతకుముందు టీడీపీ అధినేత చంద్రబాబు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కేసీఆర్‌ను పరామర్శించారు.