Thursday 13th February 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > కేసీఆర్ ను పరామర్శించిన చంద్రబాబు!

కేసీఆర్ ను పరామర్శించిన చంద్రబాబు!

cbn visits kcr

Chandrababu Visits KCR | టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి వెళ్లారు. ఇటీవల గాయమై తుంటి మార్పిడి ఆపరేషన్ చేయించుకున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను చంద్రబాబు పరామర్శించారు.

ఈ సందర్భంగా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి చంద్రబాబు వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌కు జరిగిన తుంటి మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా జరిగిందని డాక్టర్లు చెప్పినట్లు వెల్లడించారు.

కేసీఆర్ కోలుకునేందుకు ఆరు వారాల సమయం పడుతుందని తెలిపారని చంద్రబాబు చెప్పారు. కేసీఆర్ త్వరగా కోలుకుని.. మళ్లీ ప్రజాసేవలో పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతకుముందు సినీ నటుడు ప్రకాశ్ రాజ్, బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా కేసీఆర్ ను పరామర్శించారు.

You may also like
cm revanth
500 ప్రభుత్వ స్కూళ్లలో ఏఐ ఆధారిత విద్య: సీఎం రేవంత్ రెడ్డి!
ఆప్ కాంగ్రెస్ కలిసి పోటీచేసి ఉంటే!
‘కాంగ్రెస్ కు గాడిద గుడ్డు మిగిలింది’
కేజ్రీవాల్ ఓటమి..గెలిచిన వ్యక్తే ఢిల్లీ సీఎం ?

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions