Chiranjeevi to be honoured with Lifetime Achievement Award in UK | మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది. తెలుగు సినీ రంగంలో ఆయన సాధించిన విజయాలు, అందిస్తున్న సేవలకు గుర్తింపుగా యూకే ప్రభుత్వం ప్రతిష్టాత్మక పురస్కారం ప్రకటించింది.
చిరంజీవికి జీవిత సాఫల్య పురస్కారం అందించాలని యూకే పార్లమెంట్ నిర్ణయించింది. మార్చి 19న చిరంజీవి ఈ అరుదైన గౌరవాన్ని అందుకోనున్నారు. దాదాపు 40 ఏళ్ల తన సినీ జీవితంలో చిరంజీవి ఎన్నో విజయాలు, మరెన్నో అరుదైన అవార్డులు, గౌరవాలు అందుకున్నారు.
డాన్స్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన చిరంజీవి తన కెరీర్ లో 9 ఫిలింఫేర్, 3 నంది అవార్డులతోపాటు ఎన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్నారు. సినీ రంగానికి ఆయన చేస్తున్న సేవలు గుర్తించిన భారత ప్రభుత్వం కూడా 2006లో ఆయనకు పద్మభూషణ్, 2024లో పద్మవిభూషణ్ అందించి గౌరవించింది.
156 చిత్రాలు.. 537 పాటలు.. 24 వేల స్టెప్పులతో అలరించినందుకుగానూ ఇటీవల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఆయన చోటు దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆయన వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ చిత్రంలో నటిస్తున్నారు.