Chiranjeevi Shares Women’s Day Wishes with His Wife and Co-Stars | అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి.
ఈ సందర్భంగా శుక్రవారం తన సతీమణి సురేఖ మరియు తనతో పాటు నటించిన హీరోయిన్స్ తో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
‘ నా నిజ జీవితాన్ని, నా సినీ జీవితాన్ని పంచుకుని నాకు విజయం అందించిన నా హీరోయిన్స్ అందరికీ, యావన్మంది మహిళలకు చేతులు ఎత్తి నమస్కరిస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు’ అంటూ చిరంజీవి పేర్కొన్నారు.
ఈ ఫోటోలో సీనియర్ హీరోయిన్స్ రాధిక, సుహాసిని,జయసుధ, మీనా, ఖుష్భు, టబూ, నదియా ఉన్నారు.