Air Force’s Dinner Menu Viral | భారత వాయుసేన 93వ వార్షికోత్సవంలో పాకిస్థాన్ నగరాల పేర్లతో ‘మెనూ’ ఏర్పాటు చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది. కేంద్రమంత్రి కిరణ్ రిజిజు దీన్ని ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ‘ఆపరేషన్ సింధూర్’ లో భాగంగా పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలు మరియు ఎయిర్ బేస్ లను లక్ష్యంగా చేసుకుని భారత ఎయిర్ ఫోర్స్ బాంబుల వర్షం కురిపించిన నగరాల పేర్ల మీద మెనూ సిద్ధం చేయడం ఆసక్తిగా ఉందని కేంద్రమంత్రి పేర్కొన్నారు.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 93వ వార్షికోత్సవం బుధవారం జరిగిన విషయం తెల్సిందే. ఈ సందర్భంగా డిన్నర్ లో ఏర్పాటు చేసిన మెనూ ఇది. మెనూలో ఉన్న ప్రధాన వంటకాలు: రావల్పిండి చికెన్ టిక్కా మసాలా (Rawalpindi Chicken Tikka Masala), రాఫిక్వి రారా మటన్, భోలారి పనీర్ మేథీ మలై, సుక్కూర్ షామ్ సవేరా కోఫ్తా, సర్గోఢా దాల్ మఖనీ, జాకోబాబాద్ మేవా పులావ్, బహావల్పూర్ నాన్.
దేసర్ట్స్ ల్ భాగంగా బలాకోట్ టిరమిసు, ముజాఫరాబాద్ కుల్ఫీ ఫాలూదా, మురీద్కే మీఠా పాన్ ను అతిధుల కోసం ఏర్పాటు చేశారు. కాగా ఇది నెక్స్ట్ లెవల్ ట్రోలింగ్ అని నెటిజన్లు స్పందిస్తున్నారు.









