JubileeHilss By Elections | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత, మెదక్ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు. భాగ్యనగరంలో పుట్టిన ఎంఐఎం పార్టీ భాగ్యనగరంలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడం లేదని అడిగారు.
బీజేపీని అడ్డుకోవడానికి అధికార కాంగ్రెస్-ఎంఐఎం కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్ తరఫున ఒక అభ్యర్థిని నికబెట్టాయని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడం ద్వారా, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థిని మేయర్ పదవిలో కూర్చోబెట్టాలని ఆ రెండు పార్టీలు ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు రఘునందన్ రావు.
హైదరాబాద్ మేయర్ స్థానంలో ఎంఐఎం అభ్యర్థి కూర్చుంటే భాగ్యనగరంలోనూ భైంసా పరిస్థితులు వస్తాయని హెచ్చరించారు. జూబ్లీహిల్స్ ఓటర్లు ఈ విషయాన్ని గమనించి సరైన నిర్ణయం తీసుకోవాలని కొరారు. ఇదిలా ఉండగా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ కోసం బీఆరెస్, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి.









