Friday 11th September 2026
12:07:03 PM
Home > తాజా > వివాహ ఆచారాలపై నటి నమిత బోల్డ్ కామెంట్స్: ఆన్‌లైన్‌లో జోరుగా చర్చ!

వివాహ ఆచారాలపై నటి నమిత బోల్డ్ కామెంట్స్: ఆన్‌లైన్‌లో జోరుగా చర్చ!

Actress Namitha Comments On Marriage Traditions తమిళ సినీ పరిశ్రమలో అగ్రకథానాయకులతో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి నమిత సామాజిక ఆచారాలపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ‘బిహైండ్‌వుడ్స్’ (Behindwoods) యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివాహిత మహిళలపై సమాజం విధించే ఆంక్షలు, లింగ-ఆధారిత అంచనాలను ఆమె నేరుగా ప్రశ్నించారు.

తాళి, బొట్టుపై ప్రశ్నలు..

వివాహమైన తర్వాత స్త్రీలు తాళి, బొట్టు ధరించాలని ఆశించే సమాజం.. వివాహితులైన పురుషుల వైవాహిక స్థితికి ఎలాంటి గుర్తింపులు ఎందుకు అడగరని ప్రశ్నించారు. భర్త క్షేమం కోసం భార్య ఉపవాసం ఉన్నట్లే, భార్య శ్రేయస్సు కోసం భర్త ఏడాదికి ఒక్క రోజైనా ఉపవాసం ఉండే నియమం ఎందుకు లేదని నమిత ఎత్తిచూపారు.

స్త్రీలు తప్పనిసరిగా ‘తాళి’ ధరించాలని భగవద్గీత, వేదాలు లేదా పురాణాల్లో ఎక్కడైనా రాసి ఉందా అని ప్రశ్నించారు. ఈ ఆంక్షలు మతపరమైన ప్రత్యక్ష ఆదేశాలు కాదని, కాలక్రమేణా స్త్రీలపై రుద్దబడిన సామాజిక సంప్రదాయాలు మాత్రమేనని ఆమె విమర్శించారు. వివాహ వ్యవస్థలో సమానత్వం మరియు నియమాలపై నమిత చేసిన ధైర్యమైన వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి.

You may also like
ముంబై జుహూలో రూ. 80 కోట్ల లగ్జరీ ఇల్లు.. వీడియో వైరల్!
నటుడు ధనుష్ ఉదారత.. తాను చదువుకున్న స్కూల్ కు కానుకగా..!
ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూత.. క్యాన్సర్‌తో పోరాడుతూ తుదిశ్వాస!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions