Mumbai Juhu 80 Crore Beachfront Apartment దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని జుహూ తారా రోడ్‌లో ఉన్న ఒక అత్యంత విలాసవంతమైన ‘సీ-ఫేసింగ్’ అపార్ట్‌మెంట్ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ప్రముఖ సర్టిఫైడ్ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ ఫిరోజ్ మోమిన్ (Firoz Momin) ఇన్స్టాగ్రామ్‌లో పంచుకున్న ఈ రూ. 80 కోట్ల ప్రాపర్టీ వీడియోను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోవడమే కాకుండా, వినోదాత్మక కామెంట్లతో రచ్చ చేస్తున్నారు.
రూ. 80 కోట్ల ప్రాపర్టీ ప్రత్యేకతలివే..
ఫిరోజ్ మోమిన్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ప్రాపర్టీ ముంబైలోనే అత్యంత ఖరీదైన జుహూ తారా రోడ్‌లో, నేరుగా సముద్ర తీరానికి అనుసంధానమై ఉంది. విశాలమైన స్పేస్ (5BHK): ఈ ప్రాపర్టీ 5,600 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాతో, 5 బెడ్‌రూమ్‌లతో కూడిన ‘బేర్-షెల్’ (అన్‌ఫర్నిష్డ్) అపార్ట్‌మెంట్. కొనుగోలుదారులు తమ అభిరుచికి తగ్గట్టుగా దీనిని రీమోడల్ చేసుకోవచ్చు.
400 చ.అడుగుల ప్రైవేట్ బాల్కనీ: ఇక్కడ ఉన్న 400 చదరపు అడుగుల బాల్కనీ నుంచి అరేబియా సముద్ర అందాలు అద్దంలా కనిపిస్తాయి. “ఈ సీ-వ్యూ జీవితాంతం ఇలాగే ఉంటుంది, ఎప్పటికీ మాయం కాదు” అని మోమిన్ పేర్కొన్నారు.
దాదాపు 2,200 చదరపు మీటర్ల ఫ్రీహోల్డ్ ప్లాట్‌లో నిర్మించిన ఈ బిల్డింగ్‌లో ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్, జిమ్నాషియం, బాంక్వెట్ హాల్, జాగింగ్ ట్రాక్, ల్యాండ్‌స్కేప్డ్ గార్డెన్లు, మరియు 4 కవర్డ్ కార్ పార్కింగ్ సదుపాయాలు ఉన్నాయి. నేరుగా బీచ్‌కి వెళ్లే ప్రైవేట్ యాక్సెస్ ఉండటం దీని ప్రత్యేకత.
నెటిజన్ల ఫన్నీ కామెంట్లు..
ఈ రూ. 80 కోట్ల రేటు చూసి దిగ్భ్రాంతి చెందిన నెటిజన్లు సోషల్ మీడియాలో కామెడీ మీమ్స్, కామెంట్లతో రీయాక్ట్ అవుతున్నారు. “3 జన్మల EMI అవుతుందా?”: ఒక నెటిజన్ సరదాగా స్పందిస్తూ “భాయ్.. 3 జన్మల ఈఎంఐ (EMI) ఆప్షన్ ఉందా?” అని ప్రశ్నించారు.
“సోమవారం జీతం పడ్డాక వస్తా!”: మరో నెటిజన్ “సోమవారం జీతం పడగానే వచ్చి కొంటాను” అని కామెంట్ చేయగా, ఇంకొకరు “నా దగ్గర రూ. 20 తక్కువగా ఉన్నాయి, లేకపోతే నేనే కొనేవాడిని” అని నవ్వులు పూయించారు.
“రూ. 80 ఇస్తా!”: “అన్నా సరిగ్గా బేరం చేయు.. ” అంటూ మరొకరు సెటైర్ వేశారు.







