Friday 11th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > విదేశీ ఉద్యోగులకు ట్రంప్ ప్రభుత్వం షాక్!

విదేశీ ఉద్యోగులకు ట్రంప్ ప్రభుత్వం షాక్!

h1b visa process
  • H-1B విసాదారుల 60 రోజుల గ్రేస్ పిరియడ్ రద్దుకు ప్రతిపాదన!

US Proposes Ending 60 Day Grace Period H1B Visa అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బీ (H-1B) మరియు ఇతర తాత్కాలిక పని వీసాదారులు మరో ఉద్యోగం వెతుక్కునేందుకు ఇచ్చే 60 రోజుల గ్రేస్ పిరియడ్‌ను రద్దు చేయాలని ట్రంప్ పరిపాలనా యంత్రాంగం ప్రతిపాదించింది.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) రూపొందించిన ఈ నూతన నిబంధనల ప్రకారం, ఉద్యోగం ముగిసిన వెంటనే విదేశీ ఉద్యోగులు అమెరికాను వీడి వెళ్లాల్సి ఉంటుంది.

వెంటనే దేశం వీడాల్సిందే..

ప్రస్తుతం ఉద్యోగం పోయిన తర్వాత 60 రోజుల పాటు అమెరికాలోనే ఉంటూ కొత్త స్పాన్సర్‌ను వెతుక్కునేందుకు ఉన్న వెసులుబాటు రద్దవుతుంది. ఉద్యోగం పోయిన మరుసటి రోజే వీసా స్టేటస్ ముగుస్తుంది. హెచ్-1బీతో పాటు L-1 (కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు), O-1 (అసాధారణ ప్రతిభ గలవారు), E-1, E-2, E-3, TN మరియు H-1B1 వీసాదారులకు కూడా ఈ రద్దు వర్తిస్తుంది.

టెక్ దిగ్గజాలు, ఐటీ రంగానికి దెబ్బ..

విదేశీ నిపుణులపై ఆధారపడే అమెరికన్ టెక్ కంపెనీలతో పాటు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌టెక్, డెలాయిట్, ఈవై వంటి ప్రముఖ కంపెనీలపై ఇది ప్రభావం చూపనుంది. విదేశీ ఉద్యోగులు వెళ్లిపోతే ఆ ఉద్యోగ అవకాశాలు స్థానిక అమెరికన్లకు దక్కుతాయని DHS తన ప్రతిపాదనలో తెలిపింది.

ఈ ప్రతిపాదన చట్టంగా మారేముందు రెండు నెలల పాటు (60 రోజులు) ప్రజల అభిప్రాయ సేకరణ (Public Comment Period) చేపడతారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions