Tuesday 22nd September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ప్రశ్నలు కాదు.. పరిష్కారాలు చూపండి: ప్రధాని మోదీ!

ప్రశ్నలు కాదు.. పరిష్కారాలు చూపండి: ప్రధాని మోదీ!

  • ఐఐటి ఢిల్లీ స్నాతకోత్సవం
  • సోనిపట్ క్యాంపస్‌లో ‘పరం ప్రజ్ఞ’ సూపర్ కంప్యూటింగ్ సెంటర్ ప్రారంభం!

PM Modi At Delhi IIT | ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) ఢిల్లీ 57వ స్నాతకోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఐఐటి ఢిల్లీకి చెందిన సోనిపట్ క్యాంపస్‌లో నిర్మించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత అత్యున్నత పనితీరు గల సూపర్ కంప్యూటింగ్ కేంద్రం ‘పరం ప్రజ్ఞ’ (Param Pragya) ను ప్రధాని లాంఛనంగా ప్రారంభించారు.

మహిళా ప్రాతినిధ్యం పెరగాలి – ప్రధాని ఆకాంక్ష..

పట్టభద్రులైన విద్యార్థులకు, పతకాల విజేతలకు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ, విజేతలలో మహిళల ప్రాతినిధ్యాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.

“పతకాలు సాధించిన వారిలో మరికొంత మంది అమ్మాయిలు ఉంటే ఇంకా బాగుండేది. ఒకరిద్దరే ఎందుకు? రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మంది మహిళా విద్యార్థులు ముందంజలో ఉండాలి” అని ఆయన అన్నారు.

ఓరియెంటేషన్ నుండి స్నాతకోత్సవం వరకు: క్యాంపస్‌లో మొదటి రోజు అడుగుపెట్టిన క్షణం నుండి నేటి గ్రాడ్యుయేషన్ డే వరకు సాగిన ప్రయాణాన్ని విద్యార్థులు గుర్తుచేసుకోవాలని, నిరంతరం నేర్చుకునే తత్వాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.

పరిశోధన రంగానికి రూ. 1 లక్ష కోట్ల నిధులు..

దేశంలో పరిశోధన, ఆవిష్కరణలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చేపడుతున్న పలు కీలక సంస్కరణలను ప్రధాని వివరించారు.

ప్రైమ్ మినిస్టర్ రీసెర్చ్ ఫెలోషిప్, నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటుతో పాటు పరిశోధన రంగానికి రూ. 1 లక్ష కోట్ల వరకు నిధులు కేటాయించినట్లు తెలిపారు.

‘ఒకే దేశం ఒకే చందా’ (One Nation One Subscription) పథకం ద్వారా చిన్న పట్టణాల్లోని పరిశోధకులకు సైతం అంతర్జాతీయ జర్నల్స్ ఉచితంగా అందుబాటులోకి వస్తున్నాయని పేర్కొన్నారు. “కేవలం ప్రశ్నలు అడగకండి.. పరిశోధనల ద్వారా సమాధానాలను కనుగొనండి” అని గ్రాడ్యుయేట్లకు సందేశమిచ్చారు.

‘వికసిత్ భారత్’ లక్ష్యంగా నిర్ణయాలు ఉండాలి..

రాబోయే 30 నుండి 35 ఏళ్లలో విద్యార్థులు తీసుకునే నిర్ణయాలు ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారత్) నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తాయని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు.

“మీరు తీసుకునే ప్రతి నిర్ణయం దేశానికి ఎలా మేలు చేస్తుంది? ఇది దేశం యొక్క ఏ అవసరాలను తీరుస్తుంది? అనేదే ప్రాతిపదికగా ఉండాలి” అని పిలుపునిచ్చారు.

You may also like
దేశం మీకేం చేసింది కాదు.. మీరేం చేస్తారో ఆలోచించండి: నిర్మలా సీతారామన్
రూ. 5,000 కోట్ల ఆస్తి ఉన్న బీజేపీ ఎమ్మెల్యే.. బిచ్చగాడిలా మారి..!
నాతో కలిసి సాయం చెయ్ సోదరా.. విమర్శలకు సూద్ స్వీట్ రిప్లై!
అర్ధరాత్రి మహిళను రైలు నుంచి దించేసిన రైల్వే.. రూ. 2 లక్షల ఫైన్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions