Wednesday 9th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > కేంద్ర మంత్రులతో ముగిసిన సీజీపీ చర్చలు..

కేంద్ర మంత్రులతో ముగిసిన సీజీపీ చర్చలు..

  • ఏం డిమాండ్ చేశారంటే!

CJP Talks With Centre | నీట్ పరీక్ష వివాదంపై కేంద్ర మంత్రులతో కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) ప్రతినిధులు జరిపిన చర్చలు ముగిశాయి. కేంద్ర ప్రభుత్వం ముందు సీజేపీ మూడు ప్రధాన డిమాండ్లను ఉంచగా, అందులోని రెండు డిమాండ్లపై కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. నీట్ పరీక్ష అవకతవకల వల్ల మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.1 కోటి ఎక్స్‌ గ్రేషియా ఇవ్వాలని, నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులు, నాయకులపై నమోదు చేసిన పోలీసు కేసులను తక్షణమే ఎత్తివేయాలని సీజేపీ డిమాండ్ చేసింది. కేసుల ఉపసంహరణ సహా ఇతర అంశాలపై స్పందించినప్పటికీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కేంద్రం సమయం కోరినట్లు సమాచారం. ఈ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిందేనని, ఆయన పదవి నుంచి దిగిపోయే వరకు దేశవ్యాప్తంగా పోరాటాన్ని కొనసాగిస్తామని సీజేపీ స్పష్టం చేసింది. సమస్య పరిష్కారానికి రేపు మరోసారి కేంద్ర మంత్రులతో సీజేపీ నేతల చర్చలు కొనసాగనున్నాయి.

You may also like
supreme court
విద్యార్థికి నోటీసు.. గ్రేటర్ నోయిడా మేజిస్ట్రేట్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం!
నాతో కలిసి సాయం చెయ్ సోదరా.. విమర్శలకు సూద్ స్వీట్ రిప్లై!
అర్ధరాత్రి మహిళను రైలు నుంచి దించేసిన రైల్వే.. రూ. 2 లక్షల ఫైన్!
వెడ్ ఇన్ ఇండియా.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions