Wednesday 9th September 2026
12:07:03 PM
Home > తాజా > తన సొంత రక్తంతో నాకు లేఖ రాశాడు: మల్లారెడ్డి

తన సొంత రక్తంతో నాకు లేఖ రాశాడు: మల్లారెడ్డి

Mallareddy Clarifies Party Change Rumors | తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న నేత మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్ ఓటమి తర్వాత ఆయన పార్టీ మారుతారంటూ అనేక సార్లు వార్తలు వచ్చాయి. ఆయన వాటిని ఖండిస్తూ వచ్చారు.

తాజాగా మల్లారెడ్డి మరోసారి తనపై వస్తున్న రూమర్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న ఆయన, తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలన్నీ నిరాధారమైన ప్రచారమేనని కొట్టిపారేశారు.

తాను పార్టీ వీడుతున్నాననే రూమర్లను నిజమని నమ్మి ఒక అభిమాని తన సొంత రక్తంతో లేఖ రాయడం తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. త్వరలోనే ఆ అభిమానిని నేరుగా కలిసి మాట్లాడతానని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మల్లారెడ్డి, ఆయన 125 ఏళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆశీర్వదించారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి కేటీఆరే ముఖ్యమంత్రి కాబోతున్నారని, ఆయన్ను సీఎం పీఠంపై చూడటమే తన ప్రధాన లక్ష్యమని వ్యాఖ్యానించారు.

You may also like
BJP Kishan REddy
జీవో 97ను బేషరతుగా రద్దు చేయాలి: కిషన్ రెడ్డి!
TG: ముగ్గురు ప్రభుత్వ విప్‌లకు ‘రాష్ట్ర మంత్రి హోదా’!
tpcc chief mahesh goud
కేసీఆర్ కుటుంబంలో తగాదాలకు మూలం అదే: టీపీసీసీ చీఫ్ మహేశ్
ktr comments
అన్నపూర్ణ నా తెలంగాణలో బువ్వకోసం బిడ్డల ఏడ్పులా: కేటీఆర్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions