Tuesday 21st July 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > నీట్ పేపర్ లీక్‌పై కఠిన చర్యలు తప్పువు: ప్రధాని మోదీ!

నీట్ పేపర్ లీక్‌పై కఠిన చర్యలు తప్పువు: ప్రధాని మోదీ!

  • ఎన్డీయే సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టత!

PM Modi On NEET Paper Leakage | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ (NEET) ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో బాధ్యులైన వారిపై అత్యంత కఠినమైన చర్యలు తప్పవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

భవిష్యత్తులో ఇలాంటి పేపర్ లీకేజీలు పునరావృతం కాకుండా చూసుకోవడం దేశం అందరి ఉమ్మడి బాధ్యత అని ఆయన ఉద్ఘాటించారు.

మంగళవారం ఎన్డీయే (NDA) పార్లమెంటరీ పార్టీ ‘మంగళ్ మిలన్’ సమావేశం అనంతరం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజూ ఈ వివరాలను వెల్లడించారు.

ఎలాంటి అవకతవకలకు తావులేని “ఫూల్‌ప్రూఫ్” పరీక్షల వ్యవస్థను రూపొందించడానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ప్రధాని పిలుపునిచ్చినట్లు రిజిజూ తెలిపారు.

“రాజకీయ విభేదాలు ఉన్నా దేశం కోసం కలిసి పనిచేయాలి”

సభ సాఫీగా సాగేందుకు మరియు శాసనసభ వ్యవహారాలకు మద్దతుగా ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు ఐక్యంగా ఉండాలని ప్రధాని కోరారు. అలాగే, పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు నిర్ణాత్మకంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.

“రాజకీయంగా విభిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ, దేశ భవిష్యత్తు కోసం, యువత సంక్షేమం కోసం పనిచేయాల్సిన ఉమ్మడి బాధ్యత ఎంపీలందరిపై ఉంది.

నీట్ పేపర్ లీక్ ఆరోపణలు వచ్చిన వెంటనే ప్రభుత్వం వేగంగా స్పందించి, అరెస్టులు చేయడంతో పాటు నిందితులపై కఠిన చర్యలు చేపట్టింది.

విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకుండా వెంటనే రీ-ఎగ్జామ్ కూడా నిర్వహించాం.” అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.

సీబీఐ వేగవంతమైన విచారణ..

ఈ కేసుకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) ఇప్పటికే ప్రధాన సూత్రధారిని అరెస్టు చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పరీక్ష ప్రక్రియలో భాగస్వామిగా ఉన్న ఒక కెమిస్ట్రీ లెక్చరర్ ఈ లీకేజీకి సూత్రధారిగా గుర్తించారు.

మరోవైపు, నీట్ పరీక్షకు సంబంధించి మోసపూరిత కార్యకలాపాలు, అనుమానాస్పద ప్రకటనలను నివేదించడానికి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించింది.

ఢిల్లీలో ఊపందుకున్న విద్యార్థుల నిరసనలు: ఒకవైపు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాగా, మరోవైపు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసనలు ఉధృతమయ్యాయి.

నీట్ అక్రమాలతో పాటు ఇటీవల సీబీఎస్‌ఈ (CBSE) ఆన్‌లైన్ మార్కింగ్ వ్యవస్థలో దొర్లిన తప్పులపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

కేంద్ర మంత్రులతో భేటీ..

నిరసనకారుల ప్రతినిధులు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో సమావేశమై తమ డిమాండ్లతో కూడిన లేఖను అందజేశారు. మరోవైపు పార్లమెంట్ సమావేశాల మొదటి రోజే నీట్ పేపర్ లీక్ మరియు రామ్ మందిర్ విరాళాల వ్యవహారంపై ప్రతిపక్షాలు ఉభయ సభల్లోనూ తీవ్ర నిరసనలు తెలిపాయి.

You may also like
మారువేషంలో బస్సు ఎక్కిన కర్ణాటక మంత్రి!
రూ.21 వేల పెట్టుబడితో రూ.3.5 లక్షల ఆదాయం..

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions