Vaibhav Suryavanshi Targets In T20s | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో రాజస్థాన్ రాయల్స్ (RR) యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసక బ్యాటింగ్ ఈ సీజన్‌లో ఒక సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది.
అనుభవజ్ఞులైన అంతర్జాతీయ బౌలర్లను సైతం లెక్కచేయకుండా బౌండరీల వర్షం కురిపిస్తూ, రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లేఆఫ్స్ (Playoffs) కు చేరడంలో వైభవ్ అత్యంత కీలక పాత్ర పోషించాడు.
ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ తన కెరీర్ ఆంబిషన్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ క్రికెట్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. టీ20 ఫార్మాట్‌లో ఎవరికీ సాధ్యంకాని డబుల్ సెంచరీ (200 పరుగులు) సాధించడమే తన జీవిత లక్ష్యమని వైభవ్ స్పష్టం చేశాడు.
పీటర్సన్ విసిరిన ఛాలెంజ్ 25 బంతుల్లోనే ఖేల్ ఖతం!
ఇటీవల ఇంగ్లాండ్ మాజీ లెజెండరీ ప్లేయర్ కెవిన్ పీటర్సన్.. వైభవ్ ప్రతిభను పరీక్షించేందుకు తన యూట్యూబ్ ఛానల్ వేదికగా ఒక క్రేజీ ఛాలెంజ్ విసిరారు.
“టీ20 స్టైల్‌లో 50 బంతుల్లో 100 పరుగులు చేసి చూపించు” అని పీటర్సన్ సవాల్ చేయగా.. వైభవ్ దాన్ని కేవలం 25 బంతుల్లోనే పూర్తి చేసి అందరి మైండ్ బ్లాక్ చేశాడు!
కేవలం 25 బంతులు ఎదుర్కొన్న వైభవ్.. ఏకంగా 14 సిక్సర్లు బాది 104 పరుగులు సాధించాడు. ఈ అసాధారణ ఇన్నింగ్స్ చూసిన కెవిన్ పీటర్సన్ సైతం నోరెళ్లబెట్టక తప్పలేదు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
‘క్రిస్ గేల్’ రికార్డే టార్గెట్..
ఈ ఛాలెంజ్ ముగిసిన అనంతరం వైభవ్ సూర్యవంశీ మాట్లాడుతూ తన మైండ్ సెట్‌ను బయటపెట్టాడు.
“టీ20 క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్ లో 200 పరుగులు చేయాలనేది నా డ్రీమ్. ఐపీఎల్ హిస్టరీలోనే ‘యూనివర్స్ బాస్’ క్రిస్ గేల్ సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోరు 175 పరుగుల రికార్డును బ్రేక్ చేయడమే నా మెయిన్ టార్గెట్. మైదానంలో బౌలర్ ఎవరనేది నాకు ముఖ్యం కాదు.. బంతిని బౌండరీ లైన్ దాటించడమే నాకు తెలుసు” అని వైభవ్ ధీమా వ్యక్తం చేశాడు.
ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ రేసులో ఉండటంతో, రాబోయే కీలక మ్యాచ్‌ల్లో వైభవ్ ఇలాంటి విధ్వంసకర ఇన్నింగ్స్ మరోటి ఆడితే.. క్రిస్ గేల్ రికార్డు ప్రమాదంలో పడటం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.







