Thursday 13th February 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ఏపీ ఫలితాలు చూసి దేశం మొత్తం షాక్ అవుతుంది: సీఎం జగన్  

ఏపీ ఫలితాలు చూసి దేశం మొత్తం షాక్ అవుతుంది: సీఎం జగన్  

ys jagan

CM YS Jagan | ఆంధ్రప్రదేశ్ ఎన్నికల (AP Elections) ఫలితాలు వైసీపీ కే (YCP) అనుకూలంగా ఉంటాయని సీఎం జగన్ (CM Jagan) ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం విజయవాడ బెంజ్ సర్కిల్ లో ఉన్న ఐ ప్యాక్ టీం సభ్యులతో ఆయన భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీ తిరిగి అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈసారి చరిత్ర సృష్టించబోతున్నామని సీఎం జగన్ చెప్పారు. 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ, 22 పార్లమెంటు సీట్లు వచ్చాయని గుర్తు చేసిన జగన్, ఈ సారి ఆ సంఖ్య ను అధిగమించబోతున్నట్లు తెలిపారు.

జూన్ 4వ తేదీన ఏపీ ఎన్నికల ఫలితాలను చూసి దేశం మొత్తం షాక్ కు గురవుతుందని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ కిషోర్ ఆలోచించలేనన్ని సీట్లు వస్తాయని సెటైర్లు వేశారు. వచ్చే ప్రభుత్వంలో ప్రజలకు మరింత మంచి చేస్తామని హామీ ఇచ్చారు.

You may also like
Telangana Caste Census Report
తెలంగాణ కులగణన వివరాలు ఇవే!
arla village gets power
స్వాతంత్య్రం వచ్చిన 77 ఏళ్ల తర్వాత కరెంట్.. ఆనందంలో గ్రామస్తులు!
vijay sai reddy
రాజకీయాలకు విజయసాయి రెడ్డి గుడ్ బై.. ఇక నా భవిష్యత్తు అదేనంటూ..!
‘చంద్రబాబు రేవంత్ ఫడ్నవీస్.. దావోస్ లో టీంఇండియా’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions