Virat Kohli | టీం ఇండియా రన్ మెషీన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) స్టార్ బాట్స్మెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రిటైర్మెంట్ అనంతరం తన ప్లాన్స్ ను బహిర్గతం చేశారు.
ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన రిటైర్మెంట్ పై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఇలా చెప్పారు..ఒక స్పోర్ట్స్ పర్సన్ గా ఏదొక రోజు కచ్చితంగా రిటైర్మెంట్ తీసుకోవాలని చెప్పారు. కానీ ఉన్నంత వరకు గేమ్ కోసం సర్వస్వం ధారా పోస్తానని పేర్కొన్నారు.
అలాగే క్రికెట్ ఆడినంత కాలం ఎటువంటి పశ్చాత్తాపం లేకుండా ఆడుతానని తెలిపారు.ఇక రిటైర్మెంట్ గురించి మాట్లాడుతూ, ఒకసారి క్రికెట్ కు గుడ్ బాయ్ చెప్పాకా తాను ఎవరికి కనిపించనని, చాలా కాలం వరకు ఎవరు తనను చూడలేరని నవ్వుతూ విరాట్ కోహ్లీ సమాధానం చెప్పారు.