– కుప్పకూలుతున్న అన్నాడీఎంకే..
- ముగ్గురు ఎమ్మెల్యేల సంచలన రాజీనామా!
CM Vijay political masterstroke To AIADMK | తమిళనాడులో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితమై మూడో స్థానానికి పడిపోయిన ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే (AIADMK) పార్టీకి ఊహించని విధంగా వరుస షాక్‌లు తగులుతున్నాయి.
ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) వ్యూహాలకు అన్నాడీఎంకే దాదాపు ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా సోమవారం ముగ్గురు కీలక అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తమ పదవులకు సంచలన రాజీనామా చేశారు.
ఇటీవల అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలోనే 20 మందికి పైగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు సీఎం విజయ్‌కు అంతర్గతంగా మద్దతు ప్రకటించి సంచలనం సృష్టించగా.. ఇప్పుడు నేరుగా రాజీనామాల పర్వం మొదలవ్వడం తమిళ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
రాజీనామా చేసిన ముగ్గురు వికెట్లు వీరే..
అన్నాడీఎంకేకు గట్టి షాక్ ఇస్తూ తమ రాజీనామా పత్రాలను స్పీకర్‌కు సమర్పించిన ఎమ్మెల్యేల వివరాలు: జయ కుమార్ సత్యభామ మరగతం కుమారవేల్
ఈ ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామాలతో తమిళనాడులోని మధురాంతకం, ధారాపురం, పెరుందురై నియోజకవర్గాల్లో త్వరలోనే ఉప ఎన్నికలు (By-Elections) జరగడం ఖాయమైంది.
టీవీకే (TVK) లోకి వలసలు.. రంగంలోకి ఆదవ్ అర్జున!
పదవులకు రాజీనామా చేసిన ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు.. ఆ వెంటనే తమిళనాడు మంత్రి, టీవీకే కీలక నేత అయిన ఆదవ్ అర్జున (Aadav Arjuna) ను కలవడం రాజకీయ వర్గాల్లో మరింత కలకలం రేపింది.
ఈ ముగ్గురు నేతలు త్వరలోనే అధికారికంగా సీఎం విజయ్ సమక్షంలో టీవీకే కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.
బలపరీక్షలో క్రాస్ ఓటింగ్ చేసిన మిగిలిన ఎమ్మెల్యేలు కూడా విడతల వారీగా అన్నాడీఎంకేను వీడి విజయ్ క్యాంప్‌లో చేరేందుకు లైన్ కట్టినట్లు సమాచారం.
ఈ పరిణామాలతో తమిళనాడులో ఈపీఎస్ (ఎడప్పాడి పళనిస్వామి) నాయకత్వం తీవ్ర సంక్షోభంలో పడగా, సీఎం విజయ్ తన రాజకీయ చతురతతో ప్రతిపక్షాన్ని కోలుకోలేని దెబ్బతీశారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.







