Monday 20th April 2026
12:07:03 PM
Home > తాజా > తెలంగాణ ‘భూ’ గణాంకాలు.. ఎవరి చేతిలో దగ్గర భూమి ఉందంటే..!

తెలంగాణ ‘భూ’ గణాంకాలు.. ఎవరి చేతిలో దగ్గర భూమి ఉందంటే..!

land in tg

Land Ownership Data In TG | తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన సమగ్ర కుల గణన (SEEEPC-2024) నివేదిక రాష్ట్రంలోని భూ యాజమాన్య సరళిని కళ్ళకు కట్టింది.

ఈ నివేదిక ప్రకారం, రాష్ట్రంలోని సాగు భూములలో అత్యధిక భాగం కొన్ని నిర్దిష్ట సామాజిక వర్గాల చేతిలోనే కేంద్రీకృతమై ఉన్నట్లు స్పష్టమైంది. ముఖ్యంగా ‘రెడ్డి’ సామాజిక వర్గం భూ యాజమాన్యంలో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది.

నివేదిక వెల్లడించిన వివరాల ప్రకారం అత్యధిక భూములు కలిగిన కులాలు ఇవే:

  1. రెడ్లు (Reddy): ఓసీ సామాజిక వర్గంలో అత్యంత ప్రభావవంతమైన రెడ్డి సామాజిక వర్గం, తమ జనాభా నిష్పత్తి కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ భూమిని కలిగి ఉన్నారు.
  2. యాదవులు (Yadav)
  3. లంబాడ (Lambada/Banjara)
  4. ముదిరాజ్ (Mudiraj)
  5. మాదిగ (Madiga)
  6. మున్నూరుకాపు (Munnuru Kapu)

నివేదికలోని ఆసక్తికర విశ్లేషణలు..
షెడ్యూల్డ్ తెగలు (ST) సగటున అనేక ఎస్సీ, బీసీ వర్గాల కంటే ఎక్కువ భూమిని కలిగి ఉన్నప్పటికీ, అవి ఎక్కువగా సాగుకు పనికిరాని (Dry Land) భూములు కావడంతో వారు ఆర్థికంగా వెనుకబడే ఉన్నట్లు నివేదిక పేర్కొంది.

బీసీల్లోని కంసాలీలు (Goldsmiths) మరియు ఎస్సీ క్రైస్తవులు రాష్ట్ర సగటు కంటే మెరుగైన సామాజిక-ఆర్థిక స్థితిలో ఉన్నట్లు సర్వేలో తేలింది.

గతంలో భూమే సామాజిక హోదాకు కొలమానంగా ఉండేది. కానీ ఇప్పుడు భూమి కంటే విద్య (Education) ద్వారానే సామాజిక అభివృద్ధి ఎక్కువగా జరుగుతోందని నివేదిక విశ్లేషించింది.

కులాంతర వివాహాల జోరు..
ఈ సర్వేలో వెల్లడైన మరో కీలక అంశం కులాంతర వివాహాలు. గతంతో పోలిస్తే అన్ని కులాల్లోనూ కులాంతర వివాహాలు చేసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని, ఇది సామాజిక మార్పుకు నిదర్శనమని మంత్రులు పేర్కొన్నారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions