Saturday 23rd May 2026
12:07:03 PM
Home > తాజా > ఒకరికి పుట్టినరోజు.. మరొకరికి పునర్జన్మ.. అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్!

ఒకరికి పుట్టినరోజు.. మరొకరికి పునర్జన్మ.. అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్!

Anna Lezhneva Emotional post | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ కుటుంబంలో ఈరోజు రెట్టింపు ప్రాధాన్యతను సంతరించుకుంది. పవన్ కళ్యాణ్ గారి కుమారుడు అకిరా నందన్ పుట్టినరోజు సందర్బంగా ఆయన భార్య అన్నా లెజ్నెవా సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు.

ఈ రోజును ఒకరికి పుట్టినరోజుగా, మరొకరికి పునర్జన్మగా ఆమె అభివర్ణించారు. గతేడాది (2025) సరిగ్గా ఇదే రోజున సింగపూర్‌లోని మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే.

ఆ ప్రమాదంలో మార్క్ శంకర్ తీవ్ర గాయాలపాలై, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న స్థితిలో క్షేమంగా బయటపడ్డారు.

“మా చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఆ అగ్నిప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడిన రోజు ఇదే. అందుకే ఇది తనకి పునర్జన్మ. మా కుటుంబం ఈ రోజును ఎప్పటికీ మర్చిపోలేదు” అని అన్నా లెజ్నెవా తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

ఆనాడు అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్‌తో పాటు మరో 15 మంది పిల్లలను తమ ప్రాణాలకు తెగించి కాపాడిన కార్మికులను ఆమె ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

“ఆ పిల్లల ప్రాణాలు కాపాడిన ఆ కార్మికులే నిజమైన హీరోలు” అంటూ ఆమె వారి పట్ల కృతజ్ఞత చాటుకున్నారు. అటు అకిరా పుట్టినరోజు వేడుకలు, ఇటు మార్క్ శంకర్ క్షేమంగా ఉన్నందుకు కృతజ్ఞతతో ఈ రోజును తమ కుటుంబం జరుపుకుంటున్నట్లు ఆమె తెలిపారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions