Sunday 23rd August 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ఏపీ బడ్జెట్..పంచాయతీ రాజ్ శాఖకు ఎన్ని రూ.కోట్లంటే!

ఏపీ బడ్జెట్..పంచాయతీ రాజ్ శాఖకు ఎన్ని రూ.కోట్లంటే!

Andhra pradesh Budget 2026-27 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2026-27 వార్షిక సంవత్సరానికి గాను శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. రూ.3,32,205 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఇందులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు చెందిన పంచాయతీ రాజ్ శాఖకు రూ.22,942 కోట్లను కేటాయించారు. అలాగే పాఠశాల విద్యాశాఖకు రూ.32,308 కోట్లను కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. రూ.3 లక్షల 32 వేల కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టగా రెవెన్యూ వ్యయం కోసం రూ.2,56,143 కోట్లు, మూలధన వ్యయం రూ.53,915 కోట్లు, రెవెన్యూ లోటు రూ.22,002 కోట్లు, ద్రవ్య లోటు రూ.75,868 కోట్లుగా పేర్కొన్నారు.

రాయలసీమ గ్లోబల్ హార్టీకల్చర్ హబ్ కోసం రూ.30000 కోట్లు, పది జిల్లాలతో కూడిన విశాఖ ఆర్థిక ప్రాంతానికి రూ.28 వేల కోట్లను కేటాయించడం విశేషం. అలాగే రాజధాని అమరావతి ప్రాంతం కోసం రూ.ఆరు వేల కోట్లు, రోడ్లు, పోర్టులు, ఎయిర్ పోర్టుల కోసం రూ.13,546 కోట్లు అలాగే వీబీ జీ రామ్ జీ పథకానికి రూ.8365 కోట్లను కేటాయించారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions