Wednesday 13th May 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > పొదుపు సూత్రాలు.. ప్రధాని మోదీ సంచలన నిర్ణయం!

పొదుపు సూత్రాలు.. ప్రధాని మోదీ సంచలన నిర్ణయం!

Modi’s convoy size reduced | ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్ యుద్ధం కారణంగా భారత్‌పై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) సంచలన నిర్ణయం తీసుకున్నారు.

తన భద్రతా కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను సగానికి తగ్గించుకోవాలని ఎస్పీజీ (SPG)ని ఆదేశించారు. సామాన్య ప్రజలకు తాను చెప్పిన ‘పొదుపు సూత్రాల’ను తన నుండే ప్రారంభించి ప్రధాని ఆదర్శంగా నిలిచారు.

ప్రధాని భద్రతకు ఎటువంటి విఘాతం కలగకుండానే వాహనాల సంఖ్యను 50 శాతానికి తగ్గించారు. కాన్వాయ్‌లో ఇంధన పొదుపు కోసం ఎలక్ట్రిక్ వాహనాలను వాడాలని, అయితే ఇందుకోసం కొత్తగా ఎలాంటి కొనుగోళ్లు చేయకూడదని ప్రధాని స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని దేశ ప్రజలకు ఐదు కీలక విజ్ఞప్తులు చేశారు. వీలైనంత వరకు పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించండి. మెట్రో, ఎలక్ట్రిక్ వాహనాలు, కార్ పూలింగ్ వాడండి.

విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడేందుకు ఏడాది పాటు బంగారం కొనుగోలును వాయిదా వేయండి. అనవసరమైన విదేశీ ప్రయాణాలను పక్కన పెట్టండి. వంట నూనెల వాడకాన్ని తగ్గించి, స్వదేశీ వస్తువులకే ప్రాధాన్యం ఇవ్వండి.

వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) వంటి పద్ధతుల ద్వారా ఇంధనాన్ని ఆదా చేయండి. అని దేశ ప్రజలకు ప్రధాని పిలుపునిచ్చారు.

ప్రధాని పిలుపుతో రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తమ కాన్వాయ్‌లను తగ్గించుకున్నారు. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ ఏకంగా ఎస్కార్ట్ వాహనాన్ని వాడటం మానేశారు.

యుద్ధం వల్ల పెరగబోయే పెట్రోల్ ధరల ప్రభావం సామాన్యుడిపై పడకుండా ఉండేందుకు కేంద్రం ఈ ‘ఆస్టెరిటీ’ (Austerity) డ్రైవ్‌ను చేపట్టింది. విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడమే లక్ష్యంగా ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయం ఇతర రాజకీయ నేతలకు కూడా మార్గదర్శకంగా మారింది.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions