Wednesday 16th September 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ‘చిరును పొగిడితే బాలయ్య తట్టుకోలేకపోయాడు’

‘చిరును పొగిడితే బాలయ్య తట్టుకోలేకపోయాడు’

Perni Nani Fires On Balakrishna | శాసనసభ వేదికగా మెగాస్టార్ చిరంజీవిని పొగడగానే ఎమ్మెల్యే బాలకృష్ణ తట్టుకోలేకపోయారని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి, వైసీపీ నాయకులు పేర్ని నాని. కాగా అసెంబ్లీలో గురువారం ప్రసంగించిన బాలకృష్ణ మాజీ ముఖ్యమంత్రి జగన్, చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెల్సిందే.

ఈ నేపథ్యంలో బాలకృష్ణ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం మీడియాతో మాట్లాడిన నాని బాలయ్య పై కన్నెర్ర చేశారు. నందమూరి బాలకృష్ణ పెద్ద సైకో అంటూ విమర్శించారు. ఎన్టీఆర్‌, బసవ తారకమ్మ కడుపున పుట్టి అసెంబ్లీలో నీచపు మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలకృష్ణ లాంటి వారి కోసం అసెంబ్లీలో బ్రీత్‌ అనలైజర్‌ పెట్టాలని తప్పతాగి, కళ్లు నెత్తికెక్కి బాలకృష్ణ మాట్లాడుతున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

చిరంజీవిని బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ ప్రశంసిస్తుంటే బాలకృష్ణ తట్టుకోలేక పోయారని ఆరోపించారు. సైకో బుద్ధులు, సైకో ఆలోచనలు బాలకృష్ణవే అని అన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సాయం చేయకపోతే బాలకృష్ణకు జీవితఖైదు పడేదని వ్యాఖ్యానించారు. అలాగే అఖండ సినిమా విడుదల సమయంలో టికెట్ల ధరలను పెంచుకోవడానికి నిర్మాత మిర్యాల రవీంద్రారెడ్డి తో బాలయ్య తనకు ఫోన్ చేయించారని, సీఎం జగన్ ను కలిసేందుకు సమయం ఇప్పించాలని కోరినట్లు చెప్పారు.

ఇదే విషయాన్ని నాటి ముఖ్యమంత్రి జగన్ కు చెబితే బాలకృష్ణ తనను కలిస్తే ఆయనకు రాజకీయంగా ఇబ్బంది అవుతుందని అయితే బాలయ్య ఏమి అడిగితే అది చేయాలని జగన్ తనకు చెప్పినట్లు పేర్ని నాని వివరించారు. జగన్ సంస్కారంతో వ్యవహరిస్తే బాలకృష్ణ మాత్రం సంస్కారహీనంగా మాట్లాడారని మండిపడ్డారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions