Thursday 17th September 2026
12:07:03 PM
Home > తాజా > ఝార్ఖండ్ ఎవరి సొంతం !

ఝార్ఖండ్ ఎవరి సొంతం !

Jharkhand Assembly Elections EXIT POLLS | మహారాష్ట్ర ( Maharastra ) మరియు ఝార్ఖండ్ ( Jharkhand ) రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు బుధవారంతో ముగిశాయి.

ఇప్పటికే 288 స్థానాలు ఉన్న మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమి విజయాన్ని సాధించే అవకాశం ఉన్నట్లు ఏక్సిట్ పోల్స్ ( Exit Polls ) అంచనా వేశాయి. మరోవైపు రెండు విడతలుగా జరిగిన ఝార్ఖండ్ ఎన్నికల్లో కూడా బీజేపీ కూటమి అధికారాన్ని కైవసం చేసుకొనున్నట్లు సర్వేలు వెల్లడించాయి.

ప్రముఖ పీపుల్స్ పుల్స్ సంస్థ ఎన్డీయేకు 46-58 సీట్లు, ఇండీ కూటమికి 24-37 సీట్లు, ఇతరులకు 6 నుండి 10 స్థానాల మధ్య వస్తాయని అంచనా వేశారు. అలాగే మరో సంస్థ మాట్రిజ్ ఎన్డీయేకు 42-47 సీట్లు, ఇండియా కూటమికి 25 నుండి 30 మరియు ఇతరులకు 1 నుండి 4 సీట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఝార్ఖండ్ లో మొత్తం 81 సీట్లు ఉన్నాయి.

కాగా మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నవంబర్ 23న వెలువడనున్నాయి.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions