Saturday 31st January 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > రష్యన్ అమ్మాయిలతో సెక్స్..బిల్ గేట్స్ కు రోగం?

రష్యన్ అమ్మాయిలతో సెక్స్..బిల్ గేట్స్ కు రోగం?

Bill Gates caught STD from Russian girls | మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ చుట్టూ మరోసారి వివాదాస్పద ఆరోపణలు రావడం సంచలనం సృష్టించింది. అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ తాజగా జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో సంబంధిత 30 లక్షలకు పైగా డాక్యుమెంట్లు, ఇమెయిల్స్, ఫోటోలు, వీడియోలను విడుదల చేసింది. ఈ ఫైల్స్‌లో 2013 జులైలో ఎప్‌స్టీన్ తనకు తానే పంపిన డ్రాఫ్ట్ ఇమెయిల్స్‌లో బిల్ గేట్స్‌పై షాకింగ్ ఆరోపణలు ఉన్నాయి. తన ప్రైవేట్ ఐలాండ్ లిటిల్ సెయింట్ జేమ్స్‌లో బిల్ గేట్స్ “రష్యన్ గర్ల్స్”తో సెక్స్‌లో పాల్గొన్నారని దీని మూలంగా బిల్ గేట్స్ కు శృంగార వ్యాధి సోకిందని ఇమెయిల్స్‌లో ఎప్‌స్టీన్‌ పేర్కొన్నారు . సెక్సువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజ్ – STD సోకినట్లు ఆరోపించారు. ఆ వ్యాధి చికిత్స కోసం యాంటీబయోటిక్స్ మందులు తెప్పించుకుని, తన అప్పటి భార్య మెలిండా గేట్స్‌కు రహస్యంగా ఇవ్వాలని ప్రయత్నించినట్లు కూడా ఆ ఇమెయిల్స్‌లో రాయడం కలకలం రేపింది.

అలాగే బిల్ గేట్స్‌కు మద్దతు ఇవ్వడం వల్ల తాను అనైతిక, అక్రమ కార్యకలాపాల్లో కూడా పాల్గొన్నట్లు జెఫ్రీ రాశారు. ఈ ఆరోపణలపై బిల్ గేట్స్ తరఫున ఆయన టీం వెంటనే స్పందించింది. ఈ ఆరోపణలు పూర్తిగా అసత్యం అని ఎప్‌స్టీన్ ఒక నిరూపిత అబద్ధాలు మాటలాడే వ్యక్తి అని అన్నారు. గేట్స్‌తో సంబంధం కొనసాగించలేకపోవడంతో అతడు ఇలాంటి దుష్ప్రచారం చేశాడని ఆరోపణలను తిరస్కరించారు. 2019లో జెఫ్రీ ఎప్‌స్టీన్‌ జైలులో మరణించిన తర్వాత అతడి సెక్స్ ట్రాఫికింగ్ కేసులో బిల్ గేట్స్‌తో సంబంధాలు గతంలోనూ చర్చనీయాంశమయ్యాయి. ఇదిలా ఉండగా బిల్ గేట్స్-మిలిందా 1996లో వివాహం చేసుకున్నారు. 2024లో విడాకులు తీసుకున్నారు. తమ విడాకులకు బిల్ గేట్స్ అక్రమ సంబంధాలు, జెఫ్రీ ఎప్‌స్టీన్‌ తో స్నేహం వంటివి ప్రధాన కారణాలు అని మిలిందా గేట్స్ పేర్కొన్న విషయం తెల్సిందే.

You may also like
కోఠిలో కాల్పులు..ఇదీ జరిగింది!
చర్యలు తీసుకోండి..పవన్ కు బిడ్డను కోల్పోయిన మహిళ వినతి
ఈ సైకిల్ పై బాబు రయ్ రయ్!
ఎన్నికల బరిలో గల్వాన్ వీరుడు సంతోష్ బాబు తల్లి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions