Tuesday 17th March 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్.. ఎక్కడ తెలుసా!

15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్.. ఎక్కడ తెలుసా!

No Social Media

Social Media Ban | ప్రస్తుతం ప్రతి ఒక్కరిపై సోషల్ మీడియా (Social Media) ప్రభావం ఏదో విధంగా ఉండనే ఉంటోంది. దీని వల్ల ప్రయోజనాలతోపాటు నష్టాలు కూడా ఉన్నాయి.

ముఖ్యంగా అధిక స్క్రీన్ సమయం (Screen Time) వల్ల మానసిక ఆరోగ్య సమస్యలు, ఆత్మహత్యల ప్రమాదం పెరుగుతోందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఇటీవల ఆస్ట్రేలియా 15 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ నిషేధించింది. తాజాగా ఫ్రాన్స్ కూడా ఆస్ట్రేలియా బాటలోనే నడిచింది. దేశంలో 15 ఏళ్లలోపు పిల్లకు సోషల్ మీడియాను బ్యాన్ చేస్తూ ఫ్రాన్స్ నేషనల్ అసెంబ్లీ ఓ బిల్లును ప్రవేశపెట్టింది.

130-21 ఓట్లతో అసెంబ్లీ ఈ బిల్లును ఆమోదించింది. వచ్చే సెప్టెంబర్‌లో ప్రారంభమయ్యే విద్యా సంవత్సరం నుంచే ఇది అమలులోకి వచ్చే అవకాశముంది. ఈ నిషేధంతో పాటు హైస్కూళ్లలో మొబైల్ ఫోన్‌లపై కూడా నిషేధం విధించనున్నారు.

ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ, “మన పిల్లల భవిష్యత్తును అల్గోరిథంలకు అప్పగించలేం” అని వ్యాఖ్యానించారు. ఇదే తరహాలో మనదేశంలో ఆంధ్రప్రదేశ్ కూడా 16 ఏళ్లలోపు పిల్లలపై సోషల్ మీడియా నిషేధాన్ని పరిశీలిస్తోంది.

You may also like
‘అది జాతీయ ఉద్యమంగా మారాలి’.. ప్రధానికి సోనూసూద్ విజ్ఞప్తి!
icc trophy
ICC వరల్డ్ కప్ కు తీవ్ర అవమానం..!
ఆదివాసీ కాళ్లు కడిగి క్షమాపణ కోరిన సీఎం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions