Monday 9th December 2024
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ICC వరల్డ్ కప్ కు తీవ్ర అవమానం..!

ICC వరల్డ్ కప్ కు తీవ్ర అవమానం..!

icc trophy


ICC World Cup 2023 లో భాగంగా అహ్మదాబాద్ (Ahmedabad) లో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా (Australia) జట్టు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

భారత్ (India) నిర్దేశించిన లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి ఆరోసారి ప్రపంచకప్ ను సొంతం చేసుకుంది ఆసీస్.

అయితే, ఆ వరల్డ్ కప్ కు తీవ్ర అవమానం జరిగింది. ప్రపంచకప్ గెలిచామనే గర్వంతో ఆసీస్ ప్లేయర్ మిచెల్ మార్ష్ (Mitchel Marsh) ప్రవర్తించిన తీరుపై ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు.

కప్ గెలిచిన తర్వాత డ్రెస్సింగ్ రూంలో బీర్ తాగుతూ, మిచెల్ మార్ష్ వరల్డ్ కప్ కాళ్లు పెట్టి కూర్చున్నాడు. ఈ ఫొటో బయటికి రావడంతో క్రికెట్ అభిమానులు మార్ష్ తోపాటు, ఆస్ట్రేలియా జట్టుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా భారత క్రికెట్ అభిమానులు అతడిపై తీవ్రంగా మండిపడుతున్నారు. మార్ష్ పై చర్యలు తీసుకోవాలని ఐసీసీని కోరుతున్నారు.

వరల్డ్ కప్‌ను గౌరవించాల్సిన వాళ్లు.. ఇలా అనుచితంగా వ్యవహరించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

మార్ష్ చేసిన పనికి ఆస్ట్రేలియా ప్లేయర్లను ఐపీఎల్ (IPL) లో నిషేధించాలని భారత అభిమానులు బీసీసీఐని కోరుతున్నారు.

You may also like
hilsa fish
దేవీ నవరాత్రులు.. బంగ్లాదేశ్ నుంచి 3వేల టన్నుల హిల్సా చేపలు!
mamata banerjee
‘ఇండి’ కూటమికి బిగ్ షాక్.. బెంగాల్ సీఎం కీలక ప్రకటన!
Corona cases are increasing again in India
ఇండియాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
mamata banerjee
‘అదే జరిగుంటే ఇండియా ఫైనల్స్ లో గెలిచేది..’: మమతా బెనర్జీ!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions