Saturday 2nd August 2025
12:07:03 PM
Home > క్రీడలు > ‘అదే జరిగుంటే ఇండియా ఫైనల్స్ లో గెలిచేది..’: మమతా బెనర్జీ!

‘అదే జరిగుంటే ఇండియా ఫైనల్స్ లో గెలిచేది..’: మమతా బెనర్జీ!

mamata banerjee

Mamata Banerjee Comments ICC Final | వరల్డ్ కప్ ఫైనల్స్ (ICC World Cup) లో ఇండియా ఓడిపోవడంపై రాజకీయ రంగు పులుముకుంది.

బీజేపీ, ప్రధాని మోదీ చర్యల మూలంగానే టీం ఇండియా ఫైనల్స్ లో ఓడిపోయిందని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు.

ఇందులో భాగంగా అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియం లో కాకుండా కోల్కతా ఈడెన్ గార్డెన్స్ లేదా ముంబై వాంఖడే స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ నిర్వహించి ఉంటే భారత్ గెలిచేదని అభిప్రాయపడ్డారు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.

గురువారం టీఎంసీ కార్యకర్తలు సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు మమత. అలాగే క్రికెట్ ని, దేశాన్ని కాషాయ రంగులోకి మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు.

ఇదిలా ఉండగా లక్నో స్టేడియం లో ఫైనల్స్ జరిగి ఉంటే టీం ఇండియా కచ్చితంగా విజయం సాధించేదని స్పష్టం చేశారు యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్.

లక్నో లో గనుక మ్యాచ్ జరిగి ఉంటే విష్ణు దేవుడి, మాజీ పీఎం అటల్ బిహారి వాజ్ పేయి ఆశీస్సులు కూడా ఉండేవని పేర్కొన్నారు.

You may also like
rosiah statue
దివంగత సీఎం రోశయ్య విగ్రహాన్నిఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్!
kcr
KCR ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేసిన యశోద హాస్పిటల్!
kavitha pressmeet
BJP అధ్యక్షుడి హోదాలో తొలి విజయం సాధించండి: ఎమ్మెల్సీ కవిత!
bombay high court
“ఐ లవ్ యూ చెప్పడం నేరం కాదు..” బాంబే హైకోర్టు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions