Allu Arjun filed a quash petition in the High Court of AP | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Icon Star Allu Arjun ) ఆంధ్రప్రదేశ్ హై కోర్టులో సోమవారం పిటిషన్ ( Petition )దాఖలు చేశారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల సమయంలో నంద్యాలలో తనపై నమోదైన కేసును క్వాష్ ( Quash ) చేయాలని అల్లు అర్జున్ పిటిషన్ వేశారు. కాగా ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ నంద్యాల ( Nandyal ) వెళ్లి నాటి వైసీపీ అభ్యర్థి శిల్పా రవి ( Shilpa Ravi )కి మద్దతు ప్రకటించిన విషయం తెల్సిందే.
అయితే నంద్యాలకు అల్లు అర్జున్ వచ్చారని తెలుసుకున్న అభిమానులు శిల్పా రవి ఇంటివద్దకు భారీగా చేరుకున్నారు.
144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉండగా అనుమతులు లేకుండా భారీ జనసమీకరణ చేపట్టారని అల్లు అర్జున్, శిల్పా రవి పై కేసు నమోదైంది. తాజాగా ఈ కేసును క్వాష్ చేయాలని అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు.