Friday 18th September 2026
12:07:03 PM
Home > తాజా > టీ-హబ్ లో ప్రభుత్వ ఆఫీసులు.. స్పందించిన సీఎం!

టీ-హబ్ లో ప్రభుత్వ ఆఫీసులు.. స్పందించిన సీఎం!

cm revanth reddy

Govt Office in T-Hub | టీ-హబ్‌ను (T-Hub) స్టార్టప్‌ల కేంద్రంగా కొనసాగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను టీ-హబ్‌కు మార్చుతున్నట్లు వస్తున్న వార్తలపై ముఖ్యమంత్రి స్పందించారు.

అమెరికా పర్యటనలో ఉన్న సీఎం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో ఫోన్‌లో మాట్లాడారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను అందుబాటులో ఉన్న ఇతర ప్రభుత్వ భవనాలకు మార్చాలని సూచించారు.

టీ-హబ్‌ను ప్రత్యేకంగా స్టార్టప్‌ల కేంద్రంగానే గుర్తించాలని చెప్పారు. ఇంక్యుబేటర్‌గా, ఇన్నోవేషన్ క్యాటలిస్ట్‌గా స్టార్టప్‌లకు కేంద్రంగా ఏర్పాటు చేసిన టీ-హబ్‌లో ఇతర కార్యాలయాలు ఉండకూడదని, అలాంటి ఆలోచనలు ఉంటే విరమించుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

You may also like
ప్రిన్స్ రహీమ్ అగాఖాన్ Vతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ!
ఆయన వన్ టైం వండర్.. సీఎం రేవంత్ పై సంజయ్ బారు కీలక వ్యాఖ్యలు!
cm revanth speech
ఇది 4 కోట్ల ప్రజలకు జరిగిన అవమానం’: అసెంబ్లీలో సీఎం రేవంత్ ఆగ్రహం!
మీరాలం ట్యాంక్ అభివృద్ధి పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీఎం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions