Thursday 15th October 2026
12:07:03 PM
Home > తాజా > తెలంగాణ అసెంబ్లీ: కేసీఆర్ వద్దకు సీఎం రేవంత్.. ఆసక్తికర సన్నివేశం!

తెలంగాణ అసెంబ్లీ: కేసీఆర్ వద్దకు సీఎం రేవంత్.. ఆసక్తికర సన్నివేశం!

CM Revanth Meets KCR | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తొలిరోజు ఇటీవల మరణించిన ఎమ్మెల్యేలు రాంరెడ్డి దామోదర్ రెడ్డి, కొండా లక్ష్మారెడ్డిలకు సంతాప తీర్మానాలను సభలో ప్రవేశపెట్టారు.

అనంతరం సభ్యులందరూ ఆ నేతలకు సంతాపం తెలిపారు. ఈ సమావేశాలకు సీఎం రేవంత్ రెడ్డి సహా ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హాజరు అయ్యారు. ఈ క్రమంలో అసెంబ్లీలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.

సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కేసీఆర్ వద్దకు వెళ్లి పలకరించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క సహా పలువురు నేతలు కేసీఆర్ పలకరించారు.

సంతాప తీర్మానం తర్వాత కేసీఆర్ సభ నుంచి వెళ్లిపోయారు. తొలిరోజు సభ అనంతరం బీఏసీ సమావేశం నిర్వహించి, శాసనసభ సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలనే అంశంపై నిర్ణయం తీసుకోకున్నారు.

You may also like
ప్రిన్స్ రహీమ్ అగాఖాన్ Vతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ!
cm revanth speech
ఇది 4 కోట్ల ప్రజలకు జరిగిన అవమానం’: అసెంబ్లీలో సీఎం రేవంత్ ఆగ్రహం!
మీరాలం ట్యాంక్ అభివృద్ధి పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీఎం!
నగరంలో రోడ్ల వ్యవస్థ.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions