Sunday 30th August 2026
12:07:03 PM
Home > తాజా > బాంబులు పెట్టి పేల్చేశారు.. బీఆరెస్ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు!

బాంబులు పెట్టి పేల్చేశారు.. బీఆరెస్ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు!

padi kaushik reddy

MLA Padi Kaushik Reddy | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Sessions) సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. మొదట ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలు రాంరెడ్డి దామోదర్ రెడ్డి, కొండా లక్ష్మారెడ్డిలకు సభ్యులు సంతాపం తెలిపారు.

అనంతరం ప్రశ్నోత్తరాల సెషన్ జరిగింది. ఈ సందర్భంగా BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కాళేశ్వరంలో మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లను బాంబులతో పేల్చినట్లు తన నియోజకవర్గంలో చెక్ డ్యాములను కూడా బాంబులతో పేల్చివేశారని ఆరోపించారు.

ఈ అంశంపై విచారణ జరపాలని కౌశిక్ రెడ్డి కోరారు. కరీంనగర్ జిల్లా తణుగుల చెక్ డ్యామ్ పేలుడును ఉదాహరణగా చూపుతూ ఆయన ఈ ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఖండించారు.

సభలో కూర్చొని మాట్లాడటం కాదు.. ఘటనా స్థలానికి వెళ్తామని కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు చెక్ డ్యాముల అంశాన్ని నోట్ చేసుకున్నట్లు మంత్రి సీతక్క సభలో స్పష్టం చేశారు.

You may also like
జపాన్‌ సాంకేతిక విద్యపై తెలంగాణ దృష్టి!
తస్మాత్ జాగ్రత్త.. సెల్ ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ!
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions