- ఢిల్లీలో జిమ్ ట్రైనర్ ఘాతుకం!
Delhi Gym Trainer Kills Model దేశ రాజధాని ఢిల్లీలోని తిలక్ నగర్ ప్రాంతంలో దారుణ సంఘటన వెలుగుచూసింది. వేరొకరితో మాట్లాడుతోందనే అనుమానంతో పగ పెంచుకున్న ఒక జిమ్ ట్రైనర్, యువ మోడల్‌ను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు.
హత్యకు దారితీసిన మనస్పర్థలు..
మృతురాలు ముస్కాన్ (21) ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు మోడలింగ్ చేస్తోంది. గతంలో ముస్కాన్ ఓ జిమ్‌కు వెళ్లిన సమయంలో అక్కడి జిమ్ ట్రైనర్ ఇమ్రాన్‌తో పరిచయం ఏర్పడింది. గత ఏడాదిన్నర కాలంగా వీరిద్దరూ సన్నిహితంగా మెలుగుతున్నారు. గత రెండు నెలలుగా ముస్కాన్ వేరొకరితో మాట్లాడుతోందని భావించిన ఇమ్రాన్, ఆమెపై తీవ్రంగా పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఆమె ఇంటికి వెళ్లి కత్తితో పొడిచి చంపేశాడు.
పోలీసులతో ఎదురుకాల్పులు..
హత్య అనంతరం పారిపోయిన నిందితుడు ఇమ్రాన్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. రాజౌరీ గ్రౌండ్ సమీపంలో అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా, ఇమ్రాన్ పోలీసులపైకి కాల్పులు జరిపాడు. పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇమ్రాన్ కాళ్లకు గాయాలయ్యాయి. గాయపడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.











