Monday 14th September 2026
12:07:03 PM
Home > తాజా > అత్యంత సన్నిహితులు సమక్షంలో విజయ్-రష్మిక ఎంగేజ్మెంట్

అత్యంత సన్నిహితులు సమక్షంలో విజయ్-రష్మిక ఎంగేజ్మెంట్

Rashmika Mandanna And Vijay Deverakonda Engaged | నటుడు విజయ్ దేవరకొండ నటి రష్మిక మందన్న అతి త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. గత కొన్ని నెలలుగా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారంపై విజయ్, రష్మిక ఇప్పటివరకు స్పందించలేదు. కానీ వీరిద్దరు సోషల్ మీడియా పోస్టుల ద్వారా రిలేషన్షిప్ లో ఉన్నారని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.

తాజగా శుక్రవారం హైదరాబాద్ లోని విజయ్ నివాసంలో ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో విజయ్-రష్మిక నిశ్చితార్థం జరిగింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే విజయ్, రష్మిక తొలుత గీతా గోవిందం సినిమాలో కలిసి నటించారు. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ లోనూ కలిసి అలరించారు. ప్రస్తుతం రాహుల్ సంకృత్యాయన్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions