Mega157 On-Set Video Leaked – Makers Warn of Legal Action | అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెల్సిందే.
#మెగా157, #చిరుఅనిల్ అనే వర్కింగ్ టైటిల్స్ తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం మూవీకి సంబంధించిన షూటింగ్ కేరళలో జరుగుతుంది. అయితే మూవీకి సంబంధించిన షూటింగ్ వీడియోలు లీక్ అయ్యాయి. తాజగా దీనిపై నిర్మాణ సంస్థ స్పందించింది.
మెగా 157 సెట్స్ నుండి అనధికార వీడియోలు మరియు ఫోటోలు రికార్డ్ చేయబడి, సోషల్ మీడియాలో షేర్ చేయబడిన విషయం తమ దృష్టికి వచ్చిందని సంస్థ తెలిపింది. దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది. అనుమతి లేకుండా సెట్స్ నుండి ఏదైనా కంటెంట్‌ను రికార్డ్ చేయడం లేదా పంచుకోవద్దని కోరింది.
ఇలాంటి చర్యలు సృజనాత్మక ప్రక్రియను అడ్డుకోవడమే కాకుండా, అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌పై కష్టపడి పనిచేస్తున్న మొత్తం బృందం యొక్క ప్రయత్నాలను కూడా దెబ్బతీస్తాయని పేర్కొంది. లీక్ అయిన వీడియోను అప్‌లోడ్ లేదా సర్క్యులేట్ చేసిన వ్యక్తి లేదా ప్లాట్‌ఫారమ్‌పైనా కాపీరైట్ ఉల్లంఘన మరియు పైరసీ వ్యతిరేక చట్టాల కింద కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించింది. అధికారిక అప్డేట్స్ ను మాత్రమే షేర్ చేయాలని అభిమానుల్ని సంస్థ కోరింది.








