KTR News Latest | కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదివారం తెలంగాణలో పర్యటించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించారు.
అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం, మరియు ప్రతిపక్ష బీఆరెస్ పై విమర్శలు గుప్పించారు.
ఈ నేపథ్యంలో బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ లో పసుపు బోర్డుకు నయా పైసా కేటాయించకుండా.. పేరుకు పసుపు బోర్డు పెట్టి రిబ్బన్ కట్ చేస్తే ప్రయోజనమేంటి? అని ప్రశ్నించారు.
కనీసం సొంత భవనం కూడా కట్టకుండా.. సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పసుపు బోర్డు ఆఫీసును ప్రారంభించడం సమంజసమేనా ? అని అడిగారు. అసలు ఒక్క పసుపు బోర్డును ఇన్నిసార్లు ప్రారంభించడం సబబేనా? అని ప్రశ్నించారు.
ఈ జనవరి 14న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు హోటల్ లో ఢిల్లీ నుంచి కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ వర్చువల్ గా పసుపు బోర్డును ప్రారంభించారని పేర్కొన్నారు. మరోసారి అమిత్ షా పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించడం వల్ల ప్రయోజనమేంటి ? అని కేటీఆర్ ఫైర్ అయ్యారు.










