Friday 31st July 2026
12:07:03 PM
Home > తాజా > ఆ విషయంలో తెలంగాణ దేశానికే ఆదర్శం: సీఎం రేవంత్!

ఆ విషయంలో తెలంగాణ దేశానికే ఆదర్శం: సీఎం రేవంత్!

cm revanth reddy

CM Revanth Reddy Pressmeet | వంద ఏళ్లతర్వాత కులగణన చేసింది తెలంగాణ ఒక్కటేనన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత పదకొండేళ్లుగా మోదీ సర్కార్ కులగణన ప్రయత్నంచేయ లేదన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర లో కులగణన మాట ఇచ్చారని గుర్తు చేశారు.

“రాహుల్ మాటను తెలంగాణలో చేసి చూపించాం. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారు. రాహుల్ కు తెలంగాణ ప్రజల తరుపున ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతిష్ఠాత్మకంగా కులగణన పూర్తిచేశాం. కేంద్రంపై కులగణన తెలంగాణ చేసిన వత్తిడి ఫలించింది. కులగణనను ఇప్పడి వరకు పూర్తిచేస్తారో మోదీ చెప్పాలి. అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి, సూచనలను తీసుకోవాలి.

విధివిధానాలు నిర్ణయించి ప్రాబ్లిక్ డొమైన్ లో పెట్టండి. ప్రశ్నాపత్రాలను ప్రజల కు వివరించండి. కులగణన సీక్రెట్ డాక్యుమెంట్ కాకూడదు. పార్టీ, కొందరు వ్యక్తుల విధానంగా మేము కులగణనను చేయలేదు. తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది. రోల్ మోడల్ నుండి కులగణన కు సంబంధించి సూచనలు తీసుకోండి.

ఈ అంశంలో రాజకీయ భేషజాలకు  కేంద్రం పోవద్దు. బీసీలకు నిజమైన న్యాయం జరిగేలా చూడాలి. ఆలస్యమైన కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. పకడ్బందీగా కులగణన చేయాలి. గుజరాత్ లో ఎందుకు బీజేపీ కులగణన చేయలేదు? ప్రధాని మోదీ నన్ను ఫాలో అవుతున్నారని తెలంగాణ బీజేపీ నేతలు అసూయ తో మాట్లాడుతున్నారు” అని వ్యాఖ్యానించారు సీఎం రేవంత్.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
పేపర్ లీక్ నిరోధక బిల్లుకు ఆమోదం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions