Friday 31st July 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ‘పహల్గాం ఉగ్రదాడి..NIA చేతికి కీలక ఆధారం’

‘పహల్గాం ఉగ్రదాడి..NIA చేతికి కీలక ఆధారం’

NIA takes over investigation into Pahalgam terror attack | జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి కేసుకు సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు ముమ్మరం చేసింది.

ఉగ్రదాడి సమయంలో ఒక ఫోటోగ్రాఫర్ చెట్టుపై దాక్కుని చిత్రీకరించిన సంచలన వీడియో ఎన్‌ఐఏ చేతికి చిక్కినట్లు సమాచారం. ఈ వీడియోలో ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపిన దృశ్యాలు ఉన్నాయి. ఈ వీడియో ఆధారంగా ఎన్‌ఐఏ అధికారులు దాడి జరిగిన విధానం, ఉగ్రవాదుల కదలికలు, వారి సంఖ్య వంటి కీలక అంశాలను విశ్లేషిస్తున్నారు.

బైసరన్ కు వచ్చే పర్యాటకులకు రీల్స్ తీసే స్థానిక వీడియో గ్రాఫర్ ఉగ్రదాడి ఘటనను మొత్తం చిత్రీకరించినట్లు కథనాలు వస్తున్నాయి. ఉగ్రమూకల బుల్లెట్లను తప్పించుకునేందుకు పరిగెత్తి సదరు వీడియో గ్రాఫర్ ఓ చెట్టుపై దాక్కున్నాడు. అనంతరం ఘటనను చిత్రీకరించాడు.

ఉగ్రవాదులను మరియు వారికి సహకరించిన వారిని గుర్తించడానికి ఈ వీడియో దోహద పడుతుందని అధికారులు పేర్కొన్నారు. ఉగ్రవాదులు రెండు గ్రూపులుగా విడిపోయి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. అలాగే ఉగ్రవాదులు ఇద్దరి ఫోన్లను లాక్కొని పారిపోయారు.

ఇందులో ఒకటి పర్యాటకుడిది కాగా మరొకటి స్థానికుడిది. ప్రస్తుతం ఫోన్లు స్విచ్ ఆఫ్ అయినట్లు అధికారులు గుర్తించారు. ఇదిలా ఉండగా ఈ దాడి వెనుక పాలీస్థాన్ కు చెందిన హమాస్ హస్తం కూడా ఉన్నట్లు కథనాలు వెలువడడం సంచలనంగా మారింది.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions