Tuesday 22nd September 2026
12:07:03 PM
Home > తాజా > ‘వాళ్లందరికీ నోటీసులు పంపారా..’ ఐఏఎస్ స్మితా సబర్వాల్ ట్వీట్!

‘వాళ్లందరికీ నోటీసులు పంపారా..’ ఐఏఎస్ స్మితా సబర్వాల్ ట్వీట్!

smitha sabharwal

Smitha Sabharwal Tweet | హైదరాబాద్ కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కంచ భూములు వివాదం సమయంలో ఆ ప్రదేశంలో జంతువులు ఉన్నాయంటూ ఓ ఏఐ ఫొటోతో  సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.

ఓ ట్విట్టర్ యూజర్ ఆ ఏఐ ఫొటోను ట్వీట్ చేయగా.. స్మితా సబర్వాల్ దాన్ని రీట్వీట్ చేశారు. దీనిపై పోలీసులు ఆమెకు నోటీసులు పంపారు. ఈ నోటీసులపై తాజాగా స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ సంచలన ట్వీట్ చేశారు. నోటీసులకు సమాధానం ఇచ్చానని తెలిపారు.  

గచ్చిబౌలి పోలీసు అధికారులకు పూర్తిగా సహకరించాను. BNSS చట్టం ప్రకారం చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా ఈరోజు నా వివరణ ఇచ్చాను.

నేను చేసిన పోస్టునే సోషల్ మీడియా వేదికగానే 2000 మంది వ్యక్తులు తిరిగి షేర్ చేశారు. మరి నాకు పంపినట్టే వారందరికీ నోటీసులు పంపించారా? వారందరిపైనా చర్యలు తీసుకుంటున్నారా.. అని స్పష్టం చేయాలని కోరుకుంటున్నా.  లేకపోతే ఎంపిక చేసిన వారినే టార్గెట్ చేస్తున్నారా? చట్టం అందరికీ సమానమేనా అని ప్రశ్నించారు.  

You may also like
జపాన్‌ సాంకేతిక విద్యపై తెలంగాణ దృష్టి!
తస్మాత్ జాగ్రత్త.. సెల్ ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ!
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions