Saturday 1st August 2026
12:07:03 PM
Home > క్రీడలు > ‘MI vs SRH..డేల్ స్టెయిన్ జోస్యం నిజమయ్యేనా’

‘MI vs SRH..డేల్ స్టెయిన్ జోస్యం నిజమయ్యేనా’

MI vs SRH Match | ఐపీఎల్ 2025లో భాగంగ గురువారం ముంబయి ఇండియన్స్-సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడుతున్నాయి. పాయింట్ల పట్టికలో ఈ రెండు జట్లకు సమానంగా నాలుగేసి పాయింట్లు ఉన్నాయి.

ప్లేఆప్స్ కు చేరాలంటే విజయం అవసరం. వరుస ఓటములు తర్వాత ఢిల్లీపై విజయం సాధించిన ముంబయి ఆత్మవిశ్వాసంతో ఉండగా, పంజాబ్ తో జరిగిన మ్యాచులో 245 పరుగుల భారీ లక్ష్యాన్ని చెదించి అదే దూకుడుని కొనసాగించాలని భావిస్తోంది. రెండు జట్లలో కూడా స్టార్ హిట్టర్లు ఉన్నారు.

ఈ నేపథ్యంలో ముంబయి వాంఖడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచు హై స్కోర్ గేమ్ గా మారే అవకాశం ఉంది. ఈ తరుణంలో సౌత్ ఆఫ్రికా లెజెండరీ బౌలర్ డేల్ స్టెయిన్ ఒక జోస్యం చెప్పారు. ముంబయి-హైదరాబాద్ మధ్య జరిగే మ్యాచులో ఐపీఎల్ లో తొలిసారి 300 పరుగుల స్కోర్ ను చూసే అవకాశం ఉందన్నారు.

గత సీజన్ లో హైదరాబాద్ టీం విధ్వంసకర బ్యాటింగ్ తో విరుచుకుపడింది. దింతో 287, 277, 266 పరుగులతో భారీ స్కోరు ను నమోదు చేసింది. ఈ సీజన్ లో కూడా 286 పరుగులు చేసి జోష్ లో ఉంది. ఈ క్రమంలో స్టెయిన్ చేసిన జోస్యం నిజమయ్యే అవకాశం ఉందని పలువురు కామెంట్లు పెడుతున్నారు.

ముంబయి జట్టు కూడా ఇంతే దీటుగా ఉంది. అవకాశం వస్తే వారు కూడా భారీ స్కోరు చేస్తారు. అయితే 300 పరుగుల స్కోర్ చూసే అవకాశం ఉందని చెప్పిన స్టెయిన్ ఏ టీం ఈ స్కోర్ ను కొడుతుందో అనేది మాత్రం చెప్పలేదు.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions