Friday 31st July 2026
12:07:03 PM
Home > క్రీడలు > ‘తగ్గేదెలే..సీఎస్కేలోకి పుష్ప స్టైల్ తో జడేజా ఎంట్రీ’

‘తగ్గేదెలే..సీఎస్కేలోకి పుష్ప స్టైల్ తో జడేజా ఎంట్రీ’

Ravindra Jadeja joins CSK in ‘Pushpa’ style | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ( ICC Champions Trophy ) ఘనంగా ముగిసింది. సుమారు 12 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని టీం ఇండియా ముద్దాడింది.

దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్స్ లో న్యూజీలాండ్ ను ఓడించి భారత్ విజేతగా నిలిచిన విషయం తెల్సిందే. అనంతరం భారత ఆటగాళ్లు స్వదేశానికి చేరుకుంటున్నారు. మార్చి 22 నుండి ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 ( IPL-2025 ) ప్రారంభం కానుంది.

ఈ క్రమంలో స్వదేశానికి చేరుకుంటున్న ఆటగాళ్ళు ఐపీఎల్ లోని తమ జట్లతో కలుస్తున్నారు. తాజగా రవీంద్ర జడేజా చెన్నై సూపర్ కింగ్స్ ( CSK ) టీంతో కలిశారు. దీనికి సంబంధించిన వీడియోను సీఎస్కే సోషల్ మీడియాలో షేర్ చేసింది.

పుష్ప స్టైల్ లో రవీంద్ర జడేజా ఎంట్రీ ఇచ్చిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ‘జడ్డూ అంటే పేరు కాదు..జడ్డూ అంటే బ్రాండ్’ అంటూ జడేజా పుష్ప స్టైల్ లో డైలాగ్ చెప్పి ఆదరగొట్టారు. ఇప్పటికే చెన్నై టీంతో ఎంఎస్ ధోని ( Ms Dhoni ), రవిచంద్రన్ అశ్విన్ ( R Ashwin ) వంటి ఆటగాళ్లు కలిసి ప్రాక్టీస్ మొదలుపెట్టారు.

ఈ నేపథ్యంలో చాలా గ్యాప్ తర్వాత అశ్విన్ టీంలోకి వచ్చాడు. ధోని, జడేజాతో కలిసి అశ్విన్ చెన్నై తరఫున ఆడుతుండడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions