Monday 14th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ఢిల్లీ సీఎంగా రేఖా గుప్త ప్రమాణ స్వీకారం..!

ఢిల్లీ సీఎంగా రేఖా గుప్త ప్రమాణ స్వీకారం..!

Rekha Gupta As Delhi CM | ఢిల్లీ (Delhi CM0 ముఖ్యమంత్రిగా బీజేపీ (BJP) నేత రేఖా గుప్తా (Rekha Gupta) గురువారం మధ్యాహ్నం ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా (VK Saksena) ఆమెతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.

రేఖా గుప్తతోపాటు పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ, పంకజ్ కుమార్ సింగ్, ఆశిష్ సూద్, మంజిందర్ సింగ్ సిరసా, రవీందర్ ఇంద్రజ్, కపిల్ మిశ్రా మంత్రులుగా ప్రమాణం చేశారు.

ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో  జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా సహా ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు, పలువురు ఆధ్యాత్మిక గురువులు హాజరయ్యారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ కూడా ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దాదాపు 27 ఏళ్ల తర్వాత బీజేపీ ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంది. మొత్తం 70 స్థానాలకు గానూ 48 సీట్లలో విజయం సాధించింది. ఆమ్ ఆద్మీ పార్టీ 22 సీట్లు గెలవగా, కాంగ్రెస్ ఒక్క సీటు గెలవలేకపోయింది.  

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions