Sunday 1st March 2026
12:07:03 PM
Home > తాజా > ‘రాహుల్ గాంధీ కులం మతం ఏంటి?’

‘రాహుల్ గాంధీ కులం మతం ఏంటి?’

bandi sanjay

Bandi Sanjay About Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కులం, మతం ఏంటని ప్రశ్నించారు కేంద్రమంత్రి బండి సంజయ్.

కాగా ప్రధాని మోదీ లీగల్లీ కన్వెర్టెడ్ బీసీ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Cm Revanth Reddy ) చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో స్పందించిన బండి సంజయ్ బీసీలకు 42% రిజర్వేషన్ అంశం నుండి డైవర్ట్ చేయడానికే రేవంత్ ఇలా మాట్లాడారని విమర్శించారు.

1994లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ప్రధాని మోదీని OBC జాబితాలో చేర్చారని గుర్తుచేశారు. ఇప్పుడు, రాహుల్ గాంధీ ఏ కులం? అతని మతం ఏమిటి? అతనికి తెలుసా, లేదా మీకు తెలుసా? అంటూ ప్రశ్నించారు.

రాహుల్ గాంధీ తాత ఫిరోజ్ జహంగీర్ గాంధీ, హిందూ సంప్రదాయంలో, కులం తండ్రి వంశాన్ని అనుసరిస్తుందన్నారు. ఎవరు చట్టబద్ధంగా మతం మార్చబడ్డారో లేదో చర్చించాలనుకుంటే, ముఖ్యమంత్రి 10 జనపథ్ నుండి ప్రారంభించాలని సూచించారు.

అలాగే ముస్లింలకు రిజర్వేషన్ లేదని అలాంటి ప్రయత్నాలు చేసినా విఫలమవుతాయని బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు.

You may also like
రాష్ట్రంలో కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యం
‘బీఆర్ నాయుడు కాదు..బీఆర్ కామ నాయుడు’
టీటీడీ ఛైర్మన్ వైరల్ వీడియోలు..స్పందించిన బీఆర్ నాయుడు
ఇరాన్ దాడులు..చిక్కుకున్న పీవీ సింధు, మంచు విష్ణు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions