Friday 17th April 2026
12:07:03 PM
Home > తాజా > ‘ డాక్టర్ కావాలన్న ఆ గిరిజన విద్యార్థిని కల నెరవేరనుంది ‘

‘ డాక్టర్ కావాలన్న ఆ గిరిజన విద్యార్థిని కల నెరవేరనుంది ‘

Cm Revanth Helps Tribal Student | సీఎం రేవంత్ రెడ్డి ఉదారతను చాటుకున్నారు. కుమురంభీం జిల్లా జైనూరు మండలం జెండాగూడ గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థిని సాయిశ్రద్ధ ( Saishradda ) నీట్‌ ( Neet )లో ఎస్టీ విభాగంలో 103 వ ర్యాంకు సాధించారు.

మంచి ర్యాంకుతో సీటు సాధించినా ఫీజు కట్టలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థిని ఆర్థిక పరిస్థితి విషయం సీఎం రేవంత్ దృష్టికి వెళ్ళింది. ఈ క్రమంలో ఆ విద్యార్థిని కలను నెరవేర్చే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

ఎంబీబీఎస్‌ ( MBBS )లో సీటు సాధించినా కాలేజీ ఫీజు కట్టేందుకు ఆర్థిక స్థోమత లేక ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్న సాయి శ్రద్ధకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్ధిక సాయం అందించారు.

డాక్టర్ కావాలన్న ఆ గిరిజన విద్యార్థిని కల నెరవేరనుందని ఆయన చెప్పారు. సాయిశ్రద్ధ తల్లిదండ్రులతో కలిసి బుధవారం ముఖ్యమంత్రిని కలవగా, వైద్య విద్యకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించారు. వైద్య విద్య పూర్తి చేయాలన్న కల నెరవేరుతున్నందుకు ఈ సందర్భంగా సాయిశ్రద్ధ, కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు

You may also like
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!
kalvakuntla kavitha
‘ఎస్సీల రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions