Wednesday 16th September 2026
12:07:03 PM
Home > తాజా > ఇక్కడ తులసి మొక్కకు, గంజాయి మొక్కకు పోటీ! సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు!

ఇక్కడ తులసి మొక్కకు, గంజాయి మొక్కకు పోటీ! సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు!

cpi narayana

CPI Narayana | తెలంగాణ ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడం తో మాటల్లో ఘాటును పెంచారు నేతలు.

ఈ నేపథ్యంలో మంగళవారం ఖమ్మం నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి తుమ్మల (Tummala Nageswar Rao) తరఫున ప్రచారం నిర్వహించిన సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తుమ్మలను కేసీఆర్ (KCR) తుమ్మ ముల్లుతో పోల్చారనీ, కానీ ఆయన తులసి మొక్క లాంటోడు అంటూ కితాబిచ్చారు నారాయణ.

తులసి మొక్క లాంటి తుమ్మలకు, గంజాయి మొక్క లాంటి పువ్వాడ అజయ్ (Puvvada Ajay) కు పోటీ ఉందని తెలిపారు.

ఒకవైపు కాళేశ్వర ప్రాజెక్ట్ మునిగిపోతే కల్వకుంట్ల కుటుంబ ఖజానా మాత్రం పెరిగిపోయిందని విమర్శించారు.

అహంకారంతో కేసీఆర్ నంబర్1 అయితే, కేటీఆర్ నంబర్ 2, గంజాయి మొక్క అయిన పువ్వాడ నంబర్ 3 అని ధ్వజమెత్తారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ చేసిన దీక్ష కూడా దొంగదని, ఆయన చనిపోకుండా మాత్రలు ఇచ్చారని ఆరోపించారు.

కేసీఆర్ కు డాటర్ స్ట్రోక్ తగిలిందని, ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత (Kavitha) ఉండటం తో కేసీఆర్ వెళ్లి బీజేపీ(BJP) నేతల కాళ్లు పట్టుకున్నారని ఆరోపించారు.

You may also like
గణేశ్ చతుర్థి వేళ చిరంజీవి కీలక పిలుపు!
BJP Kishan REddy
జీవో 97ను బేషరతుగా రద్దు చేయాలి: కిషన్ రెడ్డి!
cm revanth reddy
సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం నో!
“నా భర్తను యాక్సిడెంట్ చేసి చంపుతావా? లేదా?”

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions