Sunday 23rd August 2026
12:07:03 PM
Home > తాజా > కుక్కపిల్లను దత్తత తీసుకున్న మంత్రి సీతక్క

కుక్కపిల్లను దత్తత తీసుకున్న మంత్రి సీతక్క

 GHMC organises Indie puppy adoption Drive at KBR Park in Hyderabad | రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి మరియు మంత్రి సీతక్క చెరొక కుక్కపిల్లలను దత్తత తీసుకున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని కేబీఆర్ పార్కులో వాలెంటైన్స్ డే సందర్భంగా శనివారం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ‘కుక్కపిల్లల దత్తత మేళా’ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఎంపీ రేణుక చౌదరి మరియు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క, రేణుక చౌదరి చెరొక వీధి కుక్క పిల్లలను దత్తత తీసుకున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యంగా ఉన్న, వ్యాక్సిన్ చేయబడిన మొత్తం 50 కుక్కపిల్లలను ప్రదర్శించారు. వీటిలో ముప్పై పిల్లలను ప్రజలు దత్తత తీసుకున్నారు. ఈ క్రమంలో దత్తత తీసుకున్న వారితో మంత్రులు మాట్లాడారు. కుక్కపిల్లలను వారికి అప్పగించి అభినందించారు. శునకాలు ఎల్లప్పుడూ నమ్మకమైన సహచరులుగా ఉంటాయని నొక్కిచెప్పారు. స్థానిక జాతులను దత్తత తీసుకోవాలని పిలుపునిచ్చారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions