Friday 7th August 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > గర్వపడేలా చేశావ్..కుమార్తెపై జగన్ ఎమోషనల్ పోస్ట్

గర్వపడేలా చేశావ్..కుమార్తెపై జగన్ ఎమోషనల్ పోస్ట్

YS Jagan congratulated his daughter Varsha Reddy | తన కుమార్తె సాధించిన ఘనతపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ ( Ys Jagan ) ఎమోషనల్ పోస్ట్ చేశారు.

లండన్‌లోని ప్రతిష్ఠాత్మక కింగ్స్ కాలేజ్ ( King’s College London ) నుంచి ఎంఎస్సీ ఫైనాన్స్ ( MSc Finance ) పట్టా పుచ్చుకున్న జగన్ కుమార్తె వర్షారెడ్డి. ఈ క్రమంలో జగన్ కుమార్తెకు అభినందనలు తెలిపారు. డిస్టింక్షన్‌లో పాసై తమను గర్వపడేలా చేశావని ఆనందం వ్యక్తం చేశారు.

‘గాడ్ బ్లెస్ యూ’ ( God Bless You ) అని దీవిస్తూ భార్య భారతి ఇద్దరు కుమార్తెలతో కలిసి ఉన్న ఫొటోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఈ నేపథ్యంలో జగన్ కుమార్తెకు పలువురు రాజకీయ నాయకులు అభినందనలు తెలుపుతున్నారు.

కాగా, జగన్ ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు. ఈ నెల 16న జరిగిన కుమార్తె డిగ్రీ స్నాతకోత్సవంలో సతీమణి భారతితో కలిసి పాల్గొన్నారు. ఇదిలా ఉండగా లండన్ నుండి వచ్చాక జగన్ జిల్లాల పర్యాటక చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions