Friday 30th October 2026
12:07:03 PM
Home > క్రీడలు > ఆమె జీవితం స్ఫూర్తిదాయకం: క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్

ఆమె జీవితం స్ఫూర్తిదాయకం: క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్

vvs laxman

VVS Laxman | భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman) ఓ యువతి స్ఫూర్తిదాయకమైన జీవిత ప్రయాణాన్ని షేర్ చేశారు. “17 ఏళ్ల వయస్సులో వీణా అంబరీష్ (Veena Ambarish) బెంగళూరులో జరిగిన ఓ ప్రమాదంలో కాలు కోల్పోయారు.

ప్రమాదం కంటే ముందు వీణా భరత నాట్య కళాకారిణి. జీవితంలో ఇంత ఎదురుదెబ్బ తగిలినా, నిరాశ చెందక ఎంబీఏ పూర్తి చేసింది. అలాగే కొన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసింది.

కానీ డెస్క్ వద్ద ఎక్కువ సేపు కూర్చోవడంలో ఇబ్బంది కలగడంతో ఉద్యోగం వదిలేసింది. అనంతరం కుకింగ్ పై ఉన్న ప్రేమతో, బెంగళూరు జేపీ నగర్ 7త్ ఫేస్ లో ‘కరి దోస’ స్టాల్ ను ఏర్పాటు చేశారు.

ప్రతిరోజు ఉదయం 4.30 గంటలకు స్టాల్ ను తెరిచి దోశలు విక్రయిస్తారు” అని తెలిపారు లక్ష్మణ్. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ధైర్యంగా ముందుకు సాగాలని వీణ నిరూపించినట్లు లక్ష్మణ్ పేర్కొన్నారు.

You may also like
“డజన్ మంది ఎమ్మెల్యేలకు ఇద్దరు భార్యలు”: సీఎం డీకే కామెంట్స్!
hand cuffs
కన్న తల్లిని హత్య చేసి.. సూట్ కేస్ లో కుక్కి..!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions