Saturday 2nd May 2026
12:07:03 PM
Home > క్రైమ్ > కన్న తల్లిని హత్య చేసి.. సూట్ కేస్ లో కుక్కి..!

కన్న తల్లిని హత్య చేసి.. సూట్ కేస్ లో కుక్కి..!

hand cuffs
  • పోలీసుల ఎదుట లొంగిపోయిన కుమార్తె
  • బెంగళూరులో దారుణ ఘటన

ఒక మహిళ తన తల్లిని అత్యంత కిరాతకంగా హత్య చేసింది. ఆ మృతదేహాన్ని ట్రాలీ బ్యాగ్‌లో కుక్కి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లింది. ఆపై పోలీసులకు లొంగిపోయింది. ఈ దారుణ ఘటన బెంగుళూరులో చోటు చేసుకుంది. బాధితురాలిని 70 ఏళ్ల బివా పాల్‌గా గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్ కు చెందిన 39 ఏళ్ల సెనాలి సేన్‌ ఆరేళ్లుగా బెంగళూరులోని బిలేకహళ్లి ప్రాంతంలో ఉన్న ఎన్‌ఎస్‌ఆర్ గ్రీన్ అపార్ట్‌మెంట్‌లో తన భర్త, అత్త, తల్లితో కలిసి నివాసం ఉంటోంది. దీంతో సేనాలి సేన్ తల్లి మరియు అత్తకు తరచూ గొడవలు జరుగుతుండేవి.

ఈ క్రమంలో ఓ సారి సేనాలి తల్లి బివా పాల్ నిద్రమాత్రలు   నిద్ర మాత్రలు వేసుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది.

ఈ రోజువారీ రోజువారీ గొడవలతో విసుగు చెందిన సేనాలీ తన తల్లికి బలవంతంగా 90 నిద్రమాత్రలు వేసేలా చేసింది. కడుపునొప్పిగా ఉందని బాధితురాలు గోల చేయడంతో ఆమె దుపట్టాతో గొంతు బిగించి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

అనంతరం నిందితురాలు ఆమె తండ్రి ఫోటోతో పాటు మృతదేహాన్ని ట్రాలీ బ్యాగ్‌లో కుక్కి నేరుగా మైకో లేఅవుట్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి లొంగిపోయిది. విషయం తెలిసిన పోలీసులు కూడా కంగు తిన్నారు.

తన తల్లి రోజు గొడవపడుతుండటంతో విసిగిపోయి చంపేశానని పోలీసుల ఎదుట అంగీకరించింది. ఆహారంలో నిద్రమాత్రలు కలిపినట్లు చెప్పింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions