Sunday 6th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > దీపావళికి అరుదైన గౌరవం..ఆ జాబితాలో చేర్పు

దీపావళికి అరుదైన గౌరవం..ఆ జాబితాలో చేర్పు

UNESCO Declares Deepavali Among World’s Intangible Cultural Treasures | హిందు పండుగల్లో అతి ముఖ్యమైన దీపావళికి అరుదైన గౌరవం దక్కింది. యునెస్కో తమ ఇన్టాజబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో దీపావళి పండుగను చేర్చింది. ఈ మేరకు బుధవారం అధికారిక ప్రకటన వెలువడింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. ఢిల్లీలోని ఎర్రకోటలో యునెస్కో ఇంటర్ గవర్నమెంటల్ కమిటీ సమావేశం జరుగుతోంది. భారత్ మొదటిసారి ఈ సమావేశానికి ఆతిథ్యం ఇస్తుండడం విశేషం.

ఈ సమావేశంలో భాగంగా దీపావళి పండుగను అగ్రగణ్య సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్చుతున్నట్లు యునెస్కో ప్రతినిధులు ప్రకటించారు. దింతో వందేమాతరం, భారత్ మాతాకి జై అనే నినాదాలు మార్మోగాయి. చెడుపై మంచి విజయాన్ని సూచించే ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే పండుగ దీపావళి ఐసీహెచ్ జాబితాలో భాగం అవ్వడం సంతోషకతమైన క్షణం అని కేంద్ర విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions